ప్రాజెక్టు లాంచ్ చేసిన రోజునే రికార్డు స్థాయిలో రూ.500 కోట్ల విక్రయాలు
హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలపర్లలో ఒకటైన ఏఎస్ బీఎల్ ల్యాండ్ మార్క్ రికార్డు సాధించింది. ఈ సంస్థ కూకట్ పల్లి వై జంక్షన్ లో ప్రారంభించిన ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ప్రాజెక్టును లాంచ్ చేసిన తొలిరోజే ఏకంగా రూ.500 కోట్ల విక్రయాలు నమోదు చేసింది. హైదరాబాద్ లో ఎక్కువ మంది కోరుకునే చిరునామాల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టు మారడంతో.. అమ్మకాలు భారీగా జరిగాయి. 6.6 ఎకరా స్థలంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో 3, 3.5, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే 52వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన జీ ప్లస్ 4 అంతస్తసుల్లో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు.
ఇందులో విందు వినోదాలకు సంబంధించిన పలు సౌకర్యాలతోపాటు కో వర్కింగ్ స్పేస్ లు, బాంకెట్ హాల్, సూపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల ఆట స్థలం, ఫిజియోథెరపీ రూమ్ వంటి సౌకర్యాలతో అన్ని రకాల వయసుల వారికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఏఎస్ బీఎల్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు లొకేషన్ పరంగా కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుంచి కీలమైన రిటైల్ హబ్ లు , పాఠశాలలు, ఆస్పత్రులు, ఐటీ కేంద్రాలకు సులభంగా వెళ్లొచ్చు. నాణ్యతో రాజీపడకుండా సౌకర్యాన్ని కోరుకునే కుటుంబాలకు ఇది చక్కని ఎంపిక. బాలానగర్ మెట్రో స్టేషన్ కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. సాధారణానికి మించి జీవించాలని కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకునే తాము ముందుకు సాగుతున్నామని ఏఎస్ బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కోరుపోలు తెలిపారు. ‘ల్యాండ్ మార్క్ ప్రాజెక్టును పట్ణణ కుటుంబాల విభిన్న అవసరాలను తీర్చేలా రూపొందించాం.
ఈ ప్రాజెక్టు ప్రతి నివాసికి వారి జీవన అనుభవాన్ని పెంచే అధిక నాణ్యత కలిగి ఇళ్లను అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. మాపై చూపించే నమ్మకం మాకెంతో గౌరవాన్నిచ్చింది. పట్టణ జీవనాన్ని మార్చే మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.