poulomi avante poulomi avante

సెప్టెంబ‌రులో త‌గ్గిన రిజిస్ట్రేష‌న్లు

పడిపోయిన‌ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

జులైతో పోలిస్తే ఆగస్టులో
తగ్గిన 332 కోట్ల ఆదాయం

ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో
తగ్గిన 500 కోట్ల ఆదాయం

హైదరాబాద్ లో తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలు

తెలంగాణలో ప్రభుత్వ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మరీ ముఖ్యంగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అంతకంతకు పడిపోవడం ఆర్ధిక శాఖను కలవరపెడుతోంది. గత ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గడానికి హైడ్రా ప్రభావమే కారణమని తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం పరోక్షంగా రిజిస్ట్రేషన్లపై పడిందని రియల్ రంగ నిపుణలు చెబుతున్నారు. హైదరాబాద్ లో నిర్మాణ రంగం నెమ్మదించడంపై రియాల్టీ రంగం ఆందోళన వ్యక్తం చేస్తంది.

తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది. రోజు రోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం పట్ల ఆర్ధిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరుసుగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ఆగస్టులో 1,48,643 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ. 1,307 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. అంతకు ముందు నెల జులైలో 2,04,776 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ. 1,639 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే జులైతో పోలిస్తే ఆగస్టులో రూ. 332 కోట్ల ఆదాయం తగ్గింది. ఇక గత సెప్టెంబర్ నెలలో 99,970 రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ. 820 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆగస్టు నెలతో పోలిస్తే సుమారు 500 కోట్ల ఆదాయం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. అంతే జులై నెలతో పోలిస్తే రెండు నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది.

గత ఆర్ధిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ తో పోల్చినా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం గ‌ణ‌నీయంగా తగ్గిందని తెలుస్తోంది. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో 9,11,436 డాక్యుమెంట్‌ లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ. 7,668 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ జరగ్గా.. 7,253 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే గత ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరునెలలతో పోలిస్తే ఈ యేడాది మొదటి ఆరు నెలల్లో సుమారు రూ. 400 కోట్ల ఆదాయం తగ్గింది. క్రమంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు ఆదాయం తగుతూ వస్తోందని లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు అధికారులు. హైడ్రాతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లు తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైడ్రా ప్రభావంతో హెచ్‌ఎండిఏ, డిటిసిపి అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తుండడం కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. రెండు నెలలుగా అనుమతుల విషయంలో అధికారులు సైతం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడుతోందని చెబుతున్నారు. మొత్తానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా క్రమంగా ఆదాయం తగ్గిపోవడంతో రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోందని సమాచారం.

హైడ్రా దూకుడుతో చాలా మంది ఇంటి కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలంబిస్తూ.. గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. మరి కొన్నాళ్లు ఆగి.. హైడ్రాతో ఎలాంటి ప్రమాదం లేదని తేలాకే ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారట. దీంతో ఒక్కసారిగా పడిపోయిన గృహాల అమ్మకాలు మళ్లీ పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles