poulomi avante poulomi avante

పాన్ ఇండియాలో ఫ‌స్ట్!

పాన్ ఇండియాలోని మొత్తం ఎనిమిది న‌గ‌రాల్ని క్షుణ్నంగా గ‌మ‌నిస్తే.. 2021 రెండో త్రైమాసికం ఆఫీసు మార్కెట్ లీజింగులో హైద‌రాబాదే అగ్ర‌స్థానంలో నిలిచింది. కుష్‌మ‌న్ అండ్ వేక్ ఫీల్డ్ విడుద‌ల చేసిన 2021 భార‌త ఆఫీసు మార్కెట్ రెండో త్రైమాసిక నివేదిక‌లో తాజా విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్ర‌కారం.. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్లలో లీజింగ్ కార్యకలాపాలు మెరుగ్గా జరిగాయి. పాన్ ఇండియాలో జరిగిన మొత్తం ప్రీ లీజింగ్ కార్యకలాపాల్లో.. మూడింట ఒక వంతు హైదరాబాద్లోనే జరగడం విశేషం. 2021 మొదటి త్రైమాసికంతో పోల్చితే.. రెండో త్రైమాసికంలో కేవలం 9.9 మిలియన్ల చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే పలు స్థలాలు లీజుకు తీసుకున్నాయి. మొదటి త్రైమాసికంతో పోల్చితే ఇది 16.9 శాతం తక్కువ అయినప్పటికీ, రానున్న రోజుల్లో లీజింగ్ కార్య‌క‌లాపాలు మెరుగ‌య్యే అవ‌కాశ‌ముంది.

ఆఫీసు మార్కెట్ లీజింగ్‌లో హైద‌రాబాద్ వాటా దాదాపు 33.6 శాతం న‌మోదైంది. గ‌త త్రైమాసికం, వార్షిక ప్రాతిప‌దిక‌న లెక్కిస్తే 2021 రెండో త్రైమాసికంలో మెరుగైంద‌నే చెప్పాలి. అదే ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబైలో క్షీణ‌త న‌మోదైంది. టర్మ్ రెన్యూవల్స్ మాత్ర‌మే కొనసాగాయి. ఢిల్లీ మరియు నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లో 17.9% వాటాను అందించ‌గా.. ముంబై మరియు బెంగళూరు కలిసి స్థూల లీజింగ్ వాల్యూమ్‌లో నాలుగింట ఒక వంతు న‌మోదు చేశాయి. రెండో వేవ్ నిర్మాణ కార్య‌క‌లాపాల్ని ప్ర‌భావితం చేయ‌డంతో కేవ‌లం 8 మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీసు స్థ‌లం మాత్ర‌మే నిర్మాణం పూర్త‌య్యింది. వార్షిక ప్రాతిప‌దిక‌న లెక్కిస్తే.. దాదాపు 26.4% క్షీణత న‌మోదు అయ్యింది. హైద‌రాబాద్‌లో పూర్త‌య్యిన‌వి కేవ‌లం 23.4 శాతం కావ‌డం గ‌మ‌నార్హం.

Cushman and Wakefield releases

* సైట్ల‌లోనే టీకాలు వేయ‌డాన్ని మొద‌లు పెట్ట‌డంతో రానున్న 6 నుంచి 12 నెల‌ల్లో నిర్మాణ కార్య‌క‌లాపాలు మెరుగ‌య్యే అవ‌కాశ‌ముంది. మార్కెట్ సెంటిమెంట్ కూడా సానుకూలంగా మారే ఆస్కార‌ముంది. ఒక‌వేళ మూడో వేవ్ గ‌న‌క ఆరంభ‌మైతే ఆఫీసు మార్కెట్ స‌ర‌ఫరా మీద కొంత ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డొచ్చు. కాక‌పోతే, పెరుగుతున్న టీకాల వ‌ల్ల ఈసారి నిర్మాణ కార్య‌క‌లాపాలు త‌గ్గ‌క‌పోవ‌చ్చు. మూడో వేవ్ ప్ర‌భావం తేలిక‌గా ఉంటే గ‌న‌క నిర్ణీత గ‌డువులోపే నిర్మాణాలు పూర్తి కావొచ్చు.
ఎంఎన్ సీలకు సువర్ణావ‌కాశం

veerababu

రానున్న రోజుల్లో మార్కెట్ అనిశ్చితిగా ఉన్నప్పటికీ, భారతీయ ఆఫీసు మార్కెట్ మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంది. అనేక సంస్థ‌లు వేగంగా టీకాలు వేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డంతో.. వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్‌కు వెసులుబాటును క‌ల్పిస్తూనే.. ఆఫీసుకు ఉద్యోగుల్ని ర‌ప్పించే అంశంపై ప‌లు కంపెనీలు స‌మీక్షించే అవ‌కాశ‌ముంది. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావాన్ని ప‌లు బ‌డా సంస్థ‌లు దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నం పొందేందుకు వినియోగించుక‌న్నాయి. త‌మ కార్య‌క‌లాపాల విస్త‌రణ కోసం బహుళ-సంవత్సరాల ఒప్పందాల్ని కుదుర్చుకున్నాయి. ఇదే పోక‌డ రానున్న రోజుల్లోనూ కొన‌సాగే అవ‌కాశాలున్నాయి. బ‌హుళ‌జాతి సంస్థ‌లు త‌మ టెక్నాల‌జీ ఔట్‌సోర్సింగ్‌, ఆర్ అండ్ డీ కార్య‌క‌లాపాల్ని మెరుగుప‌రుస్తాయి. మొత్తానికి, దీర్ఘ‌కాలాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. హైద‌రాబాద్ ఆఫీసు మార్కెట్ ఎప్ప‌టిలాగే అగ్ర‌స్థానంలో కొన‌సాగే అవకాశ‌ముంది.

– వీరబాబు, ఎండీ, కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ (ఇండియా)

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles