అసలే ప్రీలాంచ్ మోసాలు పెరిగిపోయాయ్. పైగా కొత్త కొత్త బిల్డర్లు మార్కెట్లోకి వచ్చారు. ఎవరు డెలివరి చేస్తారో లేదో తెలియదు. ఎవరి వద్ద కొంటే ఏమవుతుందోననే ఆందోళన బయ్యర్లలో పెరిగిపోయింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ గురు ఒక వినూత్న ఆలోచన చేసింది. హైదరాబాద్లో టీజీ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులు.. అందులోనూ బయ్యర్లకు హ్యాండోవర్ చేసే సామర్థ్యం ఉన్న బిల్డర్ల వివరాల్ని.. ఇక నుంచి క్రమం తప్పకుండా అందజేయాలని నిర్ణయించింది.
ముఖ్యంగా, హైదరాబాద్లో 2025లో నిర్మితమవుతున్న ఇరవై ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో, హైదరాబాద్లో స్థిర నివాసాన్ని కోరుకోవాలని భావించేవారు.. రియల్ ఎస్టేట్ గురు ప్రచురించే ఈ ప్రాజెక్టుల వివరాల్ని చూసి.. వాటిలో తమ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.