దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయ వసతులకు డిమాండ్ పెరగనుంది. ఫలితంగా కొత్త సంవత్సరంలో ఆఫీసు అద్దెలు పెరిగే అవకాశం ఉందని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ అంచనా వేసింది. ఈ ఏడాదితో పోలిస్తే కొత్త సంవత్సరంలో 2 శాతం వరకు అద్దెలు పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది. 2023-24 మధ్య, ఢిల్లీలో కార్యాలయ అద్దెలు స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ.. కోవిడ్‌కు ముందు స్థాయికి వెళ్లినట్టు వివరించింది.
2025, 2026లో వార్షిక సగటు సరఫరా 6.5 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ తో 2 శాతం మేర అద్దెలు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. ‘2025 తర్వాత పెరుగుతున్న డిమాండ్ కారణంగా అద్దె వృద్ధి 1.5 శాతం నుంచి 2 శాతం వరకు ఉంటుందని అంచనా. అయినప్పటికీ మార్కెట్‌లోకి స్థిరంగా కొత్త సరఫరా వస్తుండటం వల్ల ఇది పెద్ద ప్రభావం చూపబోదు’ అని అభిప్రాయపడింది.