poulomi avante poulomi avante

హైదరాబాద్లో.. మైండ్ స్పేస్ భారీ డీల్

  • రూ.2038 కోట్లతో ఆఫీస్ కాంప్లెక్స్ కొనుగోలు

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మైండ్ స్పేస్ రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్) హైదరాబాద్ లో భారీ లావాదేవీ నమోదు చేసింది. మాదాపూర్ మైక్రో మార్కెట్లో ఉన్న గ్రేడ్-ఏ కమర్షియల్ ప్రాపర్టీ అయిన కామర్ జోన్ రాయ్ దుర్గ్ ని కొనుగోలు చేసింది. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ హైదరాబాద్‌లో 1.82 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని కలిగి ఉన్న సస్టెయిన్ ప్రాపర్టీస్‌ను రూ.2,038 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు చేసినట్టు కంపెనీ జనవరి 29న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మైండ్‌స్పేస్ రీట్ సస్టెయిన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం ఈక్విటీని రూ.613 కోట్ల ఈక్విటీ విలువతో కొనుగోలు చేస్తుంది. సస్టెయిన్ ప్రాపర్టీస్ వాటాదారులకు మైండ్‌స్పేస్ రీట్ లో యూనిట్లు కేటాయిస్తారు. ఈ డీల్ మార్చి నెలాఖరులోగా ముగియనుంది.

ఈ కొనుగోలుతో మైండ్ స్పేస్ రీట్ గ్రోత్ స్ట్రాటజీ, పోర్ట్ ఫోలియో స్కేల్, ఆదాయ స్థిరత్వం, యూనిట్ హోల్డర్ రిటర్నులు మెరుగవుతాయి. ఈ లావాదేవీతో కంపెనీ పోర్ట్ ఫోలియో పరిమాణం 15 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కంపెనీ స్థలంలో నెలకు చదరపు అడుగుకు రూ.69 ఆఫీస్ అద్దె ఉంటుంది. “యూనిట్‌ హోల్డర్‌లకు విలువ, వృద్ధిని అందించే మైండ్‌స్పేస్ రీట్ నిబద్ధతలో కామర్‌జోన్ రాయ్ దుర్గ్ కొనుగోలు కీలక మైలురాయి. ఈ ప్రాపర్టీ మా పోర్ట్ ఫోలియోను మెరుగుపరచడంతోపాటు ఆదాయ స్థిరత్వాన్ని పెంచుతుంది. మా వృద్ధి వ్యూహానికి అనుగుణంగా కూడా ఉంటుంది. భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా మా స్థానాన్ని బలోపేతం చేస్తుంది” అని మైండ్‌స్పేస్ రీట్ సీఈఓ రమేష్ నాయర్ పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles