- హైడ్రాకు పలువురి ఫిర్యాదు
- రంగంలో దిగి ఆక్రమణల్ని
తొలగించిన అధికారులు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూముల్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ హైడ్రా కమిషనర్ కు పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో దాదాపు 3800 మంది అక్కడ గ్రామపంచాయతీ లేఔట్ లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ భూమి ప్రభుత్వానిది అని తేలిస్తే.. తామంతా కోర్టును ఆశ్రయించామని వివరించారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చినా.. అక్కడి వ్యక్తులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంటి స్థలాలుగా అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 700కి పైగా ఇళ్ల నిర్మాణం జరిగిందని.. ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు, తాగునీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైడ్రా జోక్యం చేసుకోవాలని కోరారు.