poulomi avante poulomi avante

నిర్మాణ రంగాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని నిర్మ‌లా సీతారామ‌న్‌!

నిర్మాణ రంగం చిరకాల వాంఛ ఈ సారి కూడా ఆశగానే మిగిలిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని ఈ సెక్టార్‌ నుంచి ప్రభుత్వాలకి ఎంతో కాలంగా విజ్ఞప్తులు వెళుతున్నా ఆ కోరిక మాత్రం తీరడం లేదు. క్రెడాయ్‌, నరెడ్కో సహా అనేక మంది నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి ప‌రిశ్ర‌మ‌ హోదా గురించి విన్న‌వించినా చేసినా ఫలితం శూన్యం. 2025-2026 బడ్జెట్‌లోనూ రియల్‌ ఎస్టేట్‌కి పరిశ్రమ హోదా దక్కలేదు. ఇండస్ట్రీ స్టేటస్‌ వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం అవసరాల్ని తీర్చే విధానాలు, పథకాలు కల్పించే అవకాశం ఉండేది. డెవలపర్లకు తక్కువ వడ్డీ రేట్లకే నిధుల లభ్యత సహా అనేక ప్రయోజనాలున్నాయ్‌.

ప్రాజెక్ట్‌ల ఆలస్యానికి కారణంగా ఉన్న అనుమతుల క్రమబద్ధీకరణలోనూ క్లారిటీ రాలేదు. బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్ట్‌ల కోసం పౌర‌విమాన‌యాన శాఖ‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక సహా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల నుంచి NOC, క్లియరెన్స్‌ లాంటి అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. పర్మిషన్స్‌ తీసుకోవాల్సిన డిపార్ట్‌మెంట్స్‌ ఎక్కువ ఉండటంతో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఆలస్యం.. అటంకాలు ఎదురవుతున్నాయ్‌. సింగిల్‌ విండో సిస్టమ్‌ తెస్తే ఈ కష్టాలు తప్పుతాయనుకుంటే బడ్జెట్‌లో సింగిల్‌ విండో సిస్టమ్ గురించి ప్రస్తావన రాలేదు.

కేంద్ర బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌కి బూస్టింగ్ ఇచ్చే విషయాలు కూడా ఉన్నాయ్‌. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల డెవలప్మెంట్‌, రహదారుల అభివృద్ధి లాంటి ప్రకటనలు ప్రతక్ష్యంగా.. పరోక్షంగా ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాలకు ఉపయోగపడేవే. ఇక కొత్త పన్ను విధానం మిడిల్‌ క్లాస్‌ సెగ్మెంట్‌కి ఊరటనిచ్చేదే కాదు.. కీలక రంగాలకు మద్దతునిచ్చేది కూడా. 12 లక్షల రూపాయల వరకు పన్ను లేకపోవడం వినియోగాన్ని ప్రోత్సహించడం గ్యారంటీ అని నిర్మాణ రంగ నిపుణులు నమ్ముతున్నారు. ట్యాక్స్‌లు లేకపోవడం వల్ల ఆదాయాలు పెరగడం.. సేవింగ్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్స్‌ పర్పస్‌లోనే ఓన్‌ ప్రాపర్టీ కోసమే రియాల్టీ వైపు మళ్లిస్తారని దీనివల్ల అఫర్డబుల్‌ హౌస్‌లకు డిమాండ్ పెరగొచ్చనే అంచనాలున్నాయ్‌.

టీడీఎస్‌ ఇన్‌కమ్‌లో మార్పులు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త ఊపు ఇస్తాయంటున్నారు ఈ సెక్టార్‌ నిపుణులు. ఇంత కాలం ఒక ఇంటికే ఉన్న మినహాయింపు ఇక నుంచి రెండు ఇళ్లకి వర్తించనుంది. అంటే ఆదాయాలు ఉన్నవారు కొత్త కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల రియాల్టీ రంగంలో హౌసింగ్ సెగ్మెంట్‌కి డిమాండ్‌ పెరగనుందనే అంచనాలున్నాయ్‌. అలాగే అద్దెలపై కూడా టీడీఎస్‌ను 2.4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల పెంచే నిర్ణయం కూడా నిర్మాణ రంగానికి ఉత్సాహాన్నిచ్చేదే.

న్యూ ఏజ్‌ సిటీల్లో వేగవంతమైన అభివృద్ధికి వన్‌ ట్రిలియన్ అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ ఉపయోగపడనుంది. దీనివల్ల పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన భారీ స్థాయిలో జరుగుతుందని.. ఇన్‌ఫ్రా డెవలప్మెంట్‌ కారణంగా నిర్మాణ రంగం కూడా లాభపడుతుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. 120 కొత్త రూట్లలో ఉడాన్‌ స్కీమ్ అమలు కానుంది. 4 కోట్లకు పైగా ప్రయాణీకులకు సేవలు అందించడమే దీని లక్ష్యం. కనెక్టివిటీ మెరుగుపర్చే చర్యలంటే మౌలికరంగానికి చేతి నిండా పనే. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌లు డెవలప్‌ చేయాలనే లక్ష్యం టైర్ వన్‌.. టైర్‌ టూ సిటీస్‌లో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.

జీసీసీల‌కు పెద్ద‌పీట‌..

బడ్జెట్‌లో నిర్మాణ రంగానికి లబ్ధి చేకూర్చే మరో అంశం జీసీసీలు. గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌లో భారత్ పాత్రను పెంచడంలో భాగంగా కేంద్రం జీసీసీలపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు గ్లోబల్‌ కెపాబులిటీ సెంటర్లను ఆకర్షించడం.. ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. దీనివల్ల హైద్రాబాద్‌, బెంగళూర్‌, చెన్నై, ముంబై, పూణే లాంటి మెట్రో సిటీస్‌తో పాటు చిన్న నగరాల్లోనూ ఆఫీస్‌ స్పేస్‌కి డిమాండ్‌ ఏర్పడుతుందంటున్నారు. ఎంఎస్ఎమ్మీలకు ప్రోత్సాహాకాలు ఇవ్వడం ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు జరిగితే ఆయా ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఫాస్ట్‌గా డెవలపయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయ్‌.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles