poulomi avante poulomi avante

హైదరాబాద్ కంటే అమెరికాలోనే ఇల్లు చౌక

  •  అగ్రరాజ్యంలో సగటు ఇంటి ధర రూ.2.81 కోట్లు
  •  వెస్ట్ వర్జీనియాలో రూ.88 లక్షలకే సాధారణ ఇల్లు
  •  హైదరాబాద్లో విల్లా కనీస ధర.. రూ.4 కోట్లు

అమెరికా.. అగ్ర‌రాజ్యం.. చాలామందికి క‌ల‌లసౌధం.. అమెరికా వెళ్లిపోయి డాలర్లు సంపాదిస్తూ స్థిరపడాలని యువత కలలు కంటూ ఉంటుంది. వీలైతే అక్కడే ఇల్లు కొనుక్కోవాల‌నుకునే వాళ్లు కోకొల్లలు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హైదరాబాద్ కంటే అమెరికాలోనే ఇల్లు చౌక ధరల్లో లభిస్తున్నాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అంతమాత్రాన అమెరికాలో రేట్లు తగ్గిపోయాయని అనుకోవద్దు. గతేడాదితో పోలిస్తే అక్కడ కూడా రేట్లు భారీగానే పెరిగాయి. కానీ హైదరాబాద్ లో విల్లాల ధ‌ర‌లు అంతకంటే దారుణాతి దారుణంగా పెరిగిపోవడంతో అమెరికాలోనే చౌకగా దొరికే పరిస్థితి కనిపిస్తోంది.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ అనే కంపెనీ నివేదిక ప్రకారం ప్రస్తుతం అమెరికాలో సగటు వ్య‌క్తిగ‌త గృహం ధర 3,74,900 డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.2.81 కోట్లు. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు 50 వేల డాలర్లు (దాదాపు రూ.37.5 లక్షలు) ఎక్కువ. ఇంత మేర ధర పెరగడానికి కారణం.. కరోనాయే. ఈ మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో అక్క‌డి ప్ర‌జ‌లు సొంతింటి అవసరాన్ని తెలుసుకున్నారు. దీంతో చాలామంది ఆ దిశగా అడుగులు వేయడం.. డిమాండ్ తగ్గట్టుగా గృహాలు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. 2020 డిసెంబర్ లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రిలేటర్స్ కేవలం నెలకు 1.9 ఇళ్లను మాత్రమే అందించగలిగింది. ఇది రికార్డు స్థాయి కనిష్టం కావడం గమనార్హం. ఇక అక్కడ సాధారణ ఇంటి ధర 2,93,349 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు)గా ఉంది. వెస్ట్ వర్జీనియాలో అత్యల్పంగా రూ.88 లక్షలకే ఇల్లు దొరుకుతుండగా.. హవాయిలో అత్యధికంగా రూ.5.48 కోట్ల ధర పలుకుతోంది. మ‌రి, అమెరికాలో ఏ రాష్ట్రంలో సగటు ఇంటి ధర ఎంత ఉందంటే..

రాష్ట్రం సాధారణ ఇంటి ధర (రూ.లలో)

అలబామా 1.28 కోట్లు
అలాస్కా 2.25 కోట్లు
అరిజోనా 2.67 కోట్లు
కాలిఫోర్నియా 5.13 కోట్లు
ఫ్లోరిడా 2.23 కోట్లు
హవాయి 5.48 కోట్లు
ఇల్లినాయిస్ 1.75 కోట్లు
ఇండియానా 1.39 కోట్లు
మసాచుసెట్స్ 3.89 కోట్లు
మిచిగాన్ 1.56 కోట్లు
న్యూజెర్సీ 3.07 కోట్లు
న్యూయార్క్ 2.79 కోట్లు
పెన్సిల్వీనియా 1.76 కోట్లు
టెక్సాన్ 1.85 కోట్లు
వర్జీనియా 2.46 కోట్లు
వాషింగ్టన్ 3.89 కోట్లు
వెస్ట్ వర్జీనియా 88 లక్షలు

హైదరాబాద్లో ఎక్కువెందుకు?

క‌ర్ణుడి చావుకి ల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు.. భాగ్య‌న‌గ‌రంలో ఇళ్ల ధ‌ర‌లు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలున్నాయి. ప్ర‌భుత్వం సృష్టిస్తున్న హైప్‌.. ఇటీవ‌ల జ‌రిగిన కోకాపేట్ వేలం.. పొరుగు రాష్ట్రంలో కుప్ప‌కూలిన మార్కెట్‌.. న‌గ‌రానికి త‌ర‌లివ‌స్తున్న పెట్టుబ‌డిదారులు..యూడీఎస్లో ఫ్లాట్ల అమ్మ‌కాలు.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ధ‌ర‌లూ గ‌ణ‌నీయంగా పెరిగాయి. న‌గ‌రంలో ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో ఒక విల్లా కొనాలంటే క‌నీసం నాలుగు నుంచి ఐదు కోట్లు పెట్టాల్సిందే.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సముద్రం ఉంది కాబట్టి.. అక్కడ భూ లభ్యత తక్కువగా. అందువల్ల అక్కడ రియల్ రేట్లు పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. చెన్నై పరిస్థితి కూడా అంతే. అయితే, నాలుగు వైపులా విస్తరించడానికి అవకాశం ఉన్న హైదరాబాద్ లో సగటు పౌరుడు ఇల్లు కొనాలంటే జీవితం మొత్తం వెచ్చించినా సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్లు పెంచేస్తూ విపరీతమైన హైప్ సృష్టిస్తున్నారు. అమెరికాలో సగటు ఇంటి ధర రూ.2.81 కోట్లు ఉండగా.. హైదరాబాద్లో విల్లా కొనాలంటే క‌నీసం రూ. 3 కోట్లు పెట్ట‌నిదే దొర‌క‌దు. నార్సింగి వంటి ప్రాంతంలో అయితే రూ.4 కోట్లు, కిస్మ‌త్ పూర్లో రూ.5 కోట్లు, గ‌చ్చిబౌలిలో రూ.6-7 కోట్లు పెట్ట‌నిదే స‌గ‌టు విల్లా ల‌భించ‌ట్లేదు. న‌గ‌రం న‌డిబొడ్డున అయితే, ఫ్లాట్ల ధ‌ర‌లూ కోట్ల‌లో చేరుకున్నాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యుల సొంతింటి కల తీరకపోగా.. హైదరాబాద్ మరో ఢిల్లీ కావడం ఖాయమ‌ని చెప్పొచ్చు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles