poulomi avante poulomi avante

’రాంకీ‘ విజయ రహస్యమిదే – రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్

రాంకీ సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్  రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కొనుగోలుదారులకు నాణ్యమైన ఇళ్లను అందజేయడానికి రాంకీ సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. కొనుగోలుదారుల కోణం నుంచి ఆలోచించడం వల్లే గత పాతికేళ్ల నుంచి నిర్మాణ రంగంలో తమదైన ప్రత్యేక ముద్ర వేయగలిగామని తెలిపారు. తమ సంస్థ
హైదరాబాద్తో పాటు వైజాగ్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పంతొమ్మిది ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని వెల్లడించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘‘కరోనా కష్టకాలంలో కొనుగోలుదారులకు సరికొత్త భరోసా కలిగించాలనే నిర్ణయానికొచ్చాం. మేం కట్టే ప్రాజెక్టును అన్నివిధాల నచ్చి.. కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత.. ఎవరికైనా ఉద్యోగం పోయిందనుకోండి.. వాళ్లు వచ్చి ఫ్లాట్ రద్దు చేసుకుంటామని చెబితే.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి ఫ్లాటును రద్దు చేస్తాం. నయా పైసా కోత విధించకుండా పూర్తి స్థాయి సొమ్మును వెనక్కి ఇచ్చేస్తాం. గతేడాది ఆరంభించిన ఈ స్కీములో దాదాపు 162 ఫ్లాట్లు విక్రయించాం. అందులో ఒకే ఒక వ్యక్తి ఫ్లాటు రద్దు చేసుకున్నాడు. రెండు నెలల తర్వాత మళ్లీ కొనుక్కుంటానని మా వద్దకొచ్చాడు. అంటే, కొనుగోలుదారుల ఆపదలో ఉన్నప్పుడు వారిని అన్నివిధాల ఆపన్నహస్తం అందించాలన్నదే రాంకీ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. సంస్థ ఆరంభించిన పాతికేళ్ల నుంచి ఇదే సూత్రం అవలంభిస్తున్నాం. అందుకే, కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్నాం. మా ’’రాంకీ రీ అష్యూరెన్స్‘‘ స్కీమును 2021 జూలై వరకూ వర్తింపజేస్తున్నాం.

హైదరాబాద్లో ప్రస్తుతం ఐటీ, వాణిజ్య సముదాయాల్లో నిర్మాణ స్థలం ఎక్కువున్న మాట వాస్తవమే. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగిన లావాదేవీలు కాబట్టి, పెద్దగా ఇబ్బంది ఉండదు. సెకండ్ వేవ్ వల్ల తాత్కాలికంగా వాణిజ్య స్థలం గిరాకీకి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ, మహా అయితే రెండేళ్లలో మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాకపోతే, కొత్తగా ఐటీ, వాణిజ్య సముదాయాల్ని నిర్మించేవారు తగ్గిపోతారు. ఇవి పూర్తయ్యాకే కొత్త నిర్మాణాలు ఆరంభమవుతాయి. నివాస సముదాయలకు గిరాకీ తగ్గే ప్రసక్తే ఉండదు. ఎవరికి వారే తమ స్థాయిని బట్టి సొంతిల్లు కొనుక్కుంటారు.

ఆందోళన నుంచి అవగాహన

కరోనా వల్ల మన నిర్మాణ రంగానికి పెద్దగా నష్టమేం ఉండదు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ, నిర్మాణ పనులకు ఆటంకం కలగడం లేదు. గతంలో కొవిడ్ అంటే కొత్త కాబట్టి, భయాందోళనలు ఎక్కువుండేది. అందుకే, నిర్మాణ కార్మికులు సొంతూర్లకు వెళ్లిపోవడానికే ఇష్టపడేవారు. కానీ, ప్రస్తుతమేమో కరోనా గురించి ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. కరోనా బారిన నుంచి ఎలా రక్షించుకోవచ్చనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే, దీన్ని ఒక తాత్కాలిక సమస్యగా భావిస్తున్నారు. మహా అయితే ఒకట్రెండు నెలలు ఇబ్బంది పడతాం. ఆతర్వాత మళ్లీ కోలుకోవడం ఖాయమనే విషయం తెలిసిందే. అయినప్పటికీ, మా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తున్నాం.

మొత్తం 19 ప్రాజెక్టులు

ప్రస్తుతం మేం దాదాపు పంతొమ్మిది ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా నివాస సముదాయాలే కావడం గమనార్హం. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో వీటిని నిర్మిస్తున్నాం. మొత్తానికి, ఈ ఏడాది చివరి కల్లా ఇరవై లక్షల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో నిర్మిస్తున్న.. నాలుగు ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులకు అందజేస్తున్నాం. కొన్ని ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులకు చెప్పిన గడువు కంటే ముందే అందజేస్తున్నాం.

సిల్వర్ జూబ్లీ సందర్భంగా..

రాంకీ సంస్థ ఆరంభమై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రస్తుతం ఫ్లాటు కొన్న ప్రతి వ్యక్తికి 25 గ్రాముల బంగారం వోచర్ ను ఉచితంగా అందజేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles