రియల్ ఎస్టేట్ గురుతో టీం ఫోర్ లైవ్ స్పేసెస్
మేనేజింగ్ పార్టనర్ మురళీకృష్ణ
హైదరాబాద్ లో స్టన్నింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడమే కాకుండా నాణ్యతాపరమైన నిర్మాణంతో నిర్దేశిత గడువు కంటే ముందుగానే ఫ్లాట్లు డెలివరీ చేయడానికి సంసిద్ధమవుతున్న టీం ఫోర్ లైవ్ స్పేసెస్ మేనేజింగ్ పార్టనర్ యార్లగడ్డ మురళీకృష్ణ రెజ్ న్యూస్ కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ..
మీ టీం ఫోర్ ఎలా స్టార్ట్ అయింది?
మురళీకృష్ణ: ట్రూత్ (నిజం), ట్రస్ట్ (నమ్మకం), ట్రాన్స్ పరెన్సీ (పారదర్శకత), టీం వర్క్ అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా మా టీమ్ ఫోర్ పనిచేస్తుంది. అంతేకాకుండా మా నలుగురుం అత్యంత నిష్ణాతులం. అందువల్లే మేం విజయవంతం కాగలిగాం.
ఏదైనా విషయంలో మీ నలుగురి మధ్యలో భేదాభిప్రాయాల వంటివి వచ్చాయా? వస్తే వాటిని ఎలా పరిష్కరించుకుంటారు?
మురళీకృష్ణ: డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుంటే అది టీమే కాదు. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి. వాటిపై మేధోమథనం జరగాలి. అప్పుడు ఓ మంచి నిర్ణయానికి రావాలి. డిఫరెన్సెస్ ఉండకూడదు. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి. అప్పుడే బెస్ట్ వస్తుంది. ఇదే టీం ఫోర్ కీలక సూత్రం
నైలా మీది తొలి ప్రాజెక్టు. మియాపూర్ లోనే ఎందుకు ప్రారంభించారు? ఎన్ని ఫ్లాట్లు అమ్మారు?
మురళీకృష్ణ: మియాపూర్ లో పొటెన్షియాలిటీ ఎక్కువ. మేం ఎంచుకున్న సెగ్మెంట్ కు పొటెన్షియాలిటీ ఉంటుందని భావించాం. అలాగే మంచి ప్రొడెక్ట్ ఇవ్వగలమనే నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ ప్రారంభించాం. క్వాలిటీ, వర్క్ ప్రాగ్రెస్ లో కచ్చితంగా ముందున్నాం. ఈ డిసెంబర్ నుంచి సి బ్లాక్ డెలివరీ చేస్తాం. మేం 24 7 పనిచేస్తున్నాం. మా సిబ్బంది కూడా బాగా సహకరిస్తారు. చేస్తున్న పనిని ప్రెషర్ అని ఫీల్ కారు. ప్యాషన్ గా భావిస్తారు. వారంతా చక్కని పనితీరు కనబరచడంతోనే మంచి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నాం.
మీ స్టాఫ్ ని ఎంకరేజ్ చేయడానికీ ఏమైనా పాలసీ ఉందా?
మురళీకృష్ణ: నేను హెచ్ సీఎల్ టెక్నాలజీలో పనిచేశా. ఎంప్లాయీ ఫస్ట్ అనేది మా కంపెనీ నినాదం.. ట్రైనింగ్, టీం బిల్డింగ్ యాక్టివిటీస్, మానిటరింగ్, నాన్ మానిటరింగ్ వంటివి ఇక్కడా అమలు చేస్తున్నాం. అలాగే సరైన వ్యక్తులను ప్రమోటింగ్ చేయడం, వేతనాలు పెంచడం, తమను తాము అప్ గ్రేడ్ చేసుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాం.
బిల్డర్ కి ఉండాల్సిన పారామీటర్లు ఏమిటి?
మురళీకృష్ణ: బడ్జెట్ పై కమాండ్, క్లారిటీ ఉండాలి. అలాగే షెడ్యూల్, కాస్టింగ్ పైనా స్పష్టత ఉండాలి. ఓ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ఈ మూడు అంశాలూ చాలా కీలకం. ఇవి సరిగా ఉంటే ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం జరగదు.
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది?
మురళీకృష్ణ: రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎగుడు దిగుడులు సహజం. అయితే, మార్కెట్ ఎలా ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ బెస్ట్ గా ఉండాలన్నదే టీం ఫోర్ అభిమతం. ఓవరాల్ గా హైదరాబాద్ మార్కెట్ బాగుంది.
ఆర్కాలో 2 రోజుల్లో 129 ఫ్లాట్లు ఎలా అమ్మగలిగారు?
మురళీకృష్ణ: ప్లానింగ్ చాలా ఉపకరించింది. హైదరాబాద్ ఎప్పుడూ నెంబర్ వన్. మార్కెట్లోకి వెళ్లి ప్రాడెక్టు గురించి, లొకేషన్ గురించి, మా గత ప్రాజెక్టుల గురించి వివరించాం. మార్కెట్లోని ఇతర ప్రాజెక్టులతో బేరీజు వేసుకోమని చెప్పాం. మంచి స్పందన వచ్చింది. అందుకే 129 ప్లాట్ల వరకు అమ్మగలిగాం.