poulomi avante poulomi avante

పూర్వ వైభవం సాధ్యమేనా? 2021 రియల్ రౌండప్

    • స్థిరాస్తి రంగం గాడిన పడింది
    • కొత్త సంవత్సరంలో అంతా సానుకూలమే
    • రియల్ రంగం భవిష్యత్తుపై నిపుణుల అభిప్రాయం

కరోనా కారణంగా కాస్త ఒడుదొడుకులకు లోనైన స్థిరాస్తి రంగం గాడిన పడి, క్రమంగా పూర్వ వైభవం సంతరించుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పండగ సీజన్ లో మునుపటి సత్తా చాటిన రియల్ ఎస్టేట్ రంగం.. కొత్త సంవత్సరంలో ఇలాగే జోరు కొనసాగిస్తుందని పేర్కొంటున్నారు. గత రెండేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలను బట్టి కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకున్నాయని.. వారికి కావాల్సిన విధంగానే డెవలపర్లు సైతం చర్యలు తీసుకోవడంతో అంతా చక్కగా సాగుతోందని చెబుతున్నారు. 2021లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయ? వాటి నుంచి ఎలాంటి మార్పులు వచ్చాయి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయంలో పలువురు నిపుణులు తమ అభిప్రాయలు పంచుకున్నారు. ఎవరు ఏమన్నారో వారి మాటల్లోనే…

జీవనశైలి మారుతోంది..

మనం 2022లోకి ప్రవేశిస్తున్న తరుణంలో 2021లో ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ రాబోయే సంవత్సరంలో సానుకూల దృక్పథాన్నే కలుగజేస్తున్నాయి. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మన జీవితాల్లో కీలక మార్పులు తెచ్చింది. పరిస్థితులను మరింత మెరుగ్గా చేసుకోవడానికి సహాయపడింది. గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సబర్బన్, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న గృహాలకు డిమాండ్ పెరిగింది. హైబ్రిడ్ విక్రయ ప్రక్రియ (వర్చువల్ టూర్లు, ఆన్ సైట్ సందర్శనలు) జోరందుకుంది. అలాగే స్టాంప్ డ్యూటీ రాయితీలతోపాటు రెపో రేట్లలో మార్పులు లేకపోవడం, ఎస్ డబ్ల్యూఏఎంఐహెచ్ వంటి ప్రభుత్వ పథకాలు అటు కొనుగోలుదారులకు, ఇటు డెవలపర్లకు అక్కరకొస్తున్నాయి. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఈ రంగం స్థిరంగా నిలిచింది. అనంతరం మూడో త్రైమాసికం నుంచి ముఖ్యంగా కొన్ని మైక్రో మార్కెట్లలో డిమాండ్ బాగా ఊపందుకుంది. ఆధునిక సౌకర్యాలతోపాటు పచ్చని, విశాలమైన బహిరంగ ప్రదేశాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు ఉండటం వంటి అంశాలు మళ్లీ స్థిరాస్తి రంగం జోరుగా దూసుకుపోవడానికి కారణమయ్యాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతోపాటు ఈ రంగంలో లభించే మద్దతు కారణంగా రాబోయే నెలల్లో చాలా స్థిరమైన రికవరీ ఉంటుందని భావిస్తున్నాం.
– రోహన్ ఖాటు, డైరెక్టర్, సీసీఐ ప్రాజెక్టులు-రివాలీ పార్క్

కనిష్ట అంతరాయమే..

దేశ రియల్ ఎస్టేట్ రంగానికి 2021 అనేది ఒక సంఘటనా సంవత్సరం. ఊహించని అనిశ్చితులు, లాక్ డౌన్ 2.0 వంటివి ఈ రంగానికి కనిష్ట అంతరాయం మాత్రమే కలిగించాయి. స్టాంప్ డ్యూటీ తగ్గింపు, మహిళా కొనుగోలుదారులకు రాయితీలు ప్రకటించడం వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు విక్రయాలు వేగవంతం కావడానికి దోహదపడ్డాయి. వేగవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, థానే-కైలాన్-డోంబివాలి వంటి మైక్రో మార్కెట్ల వైపు గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపడం, మిశ్రమ వినియోగ అభివృద్ధికి స్థిరమైన డిమాండ్ వంటి అంశాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ ను మరింత మెరుగుపరిచాయి. ఇక ఈ పండగ సీజన్ లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ కావడం, గృహ కొనుగోలుదారుల నుంచి చక్కని స్పందన రావడం.. స్థిరాస్తి రంగంలో జోష్ నింపింది. వినూత్న డిజిటల్ మార్కెటింగ్, నిర్మాణ సాంకేతికత, సకాలంలో ప్రభుత్వ సంస్కరణలు వంటి విషయాలు ఈ రంగంలో మరింత వృద్ధిని చేస్తామనే ఆశతో 2022కి స్వాగతం పలుకుతున్నాం.
– శ్రీకాంత్ షిటోలే, అధ్యక్షుడు, క్రెడాయ్ ఎంసీహెచ్ఐ-కేడీయూ అండ్ ఎండీ- టైకూన్స్ గ్రూప్

గృహ కొనుగోలుదారులకు అవకాశం..

కొత్త ప్రారంభాలు, అవకాశాలతో సానుకూల దృక్పథంతో 2022లోకి వెళుతున్న నేపథ్యంలో 2021 సంవత్సరం అటు కొనుగోలుదారులకు ఇటు డెవలపర్లకు చక్కని అవకాశంగా మారింది. లాక్ డౌన్ల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రీమియం, ఉబర్ లగ్జరీ డెవలప్ మెంట్లకు డిమాండ్ పెరిగింది. విశాలమైన గృహాలు, విలాసవంతమైన జీవనశైలి, ప్రత్యేక వసతుల వంటివి క్రమంగా లావాదేవీలు పెరగడానికి కారణమయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కొనుగోలుదారుల ఆసక్తిని తగ్గించినప్పటికీ, పండగ సీజన్ తోపాటు సంవత్సరాంతంలో అన్నీ గాడిన పడి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక ఈ మహమ్మారి రావడం వల్ల అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు, ప్రోటోకాల్స్ వంటివి కచ్చితంగా పాటించేలా అందరినీ సన్నద్ధం చేసింది. గత రెండేళ్లలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో స్థిరాస్తి రంగం భవిష్యత్తు కోసం బాగా సిద్ధమైంది. 2021 ముగుస్తున్న నేపథ్యంలో 2022 స్థిరమైన రికవరతోపాటు అన్నివిధాలా సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
– శ్రేయాన్స్ జే షా, మేనేజింగ్ డైరెక్టర్, ఎంజే షా గ్రూప్

పెరుగుతున్న గిరాకీ

టీకాలు వేగంగా వేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారులు ఇళ్ల‌ను కొన‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అందుకే రెసిడెన్షియల్‌, క‌మ‌ర్షియ‌ల్ గృహాల‌కు మంచి గిరాకీ పెరుగుతోంది. ఇది రానున్న రోజుల్లో మార్కెట్‌ను గ‌ణ‌నీయంగా వృద్ధి చేస్తుంది. 2022లో రెండు త్రైమాసికాల్లో.. భారతదేశంలోని వివిధ నగరాల్లో నివాస గృహాల అమ్మ‌కాలు ఇప్పటికే పుంజుకుంటున్నప్పటికీ, 2022లో మనం ‘కొత్త సాధారణ’ యుగంలోకి ప్రవేశించినప్పుడు వాణిజ్య మరియు పారిశ్రామిక రియల్ ఎస్టేట్ విభాగం పుంజుకునే భారీ అవ‌కాశ‌ముంది. స్టాంప్ డ్యూటీ మినహాయింపు మరియు వాస్తవిక ప్రాపర్టీ ధరలతో కలిపి బ్యాంకు రుణాలపై వ‌డ్డీ రేట్లు వంటి అంశాల వ‌ల్ల ఇన్‌ఫ్రా కొత్త శ‌కానికి నాంది ప‌లికిన‌ట్లు అవుతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles