పర్యావరణ నిబంధనలను ఇష్టారాజ్యంగా తుంగలో తొక్కిన పలువురు బిల్డర్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర్రజేసింది. ఈ ఉల్లంఘటనలకు గానూ వారికి రూ.115 కోట్ల జరిమానా విధించింది. హర్యానా సోనిపట్ జిల్లా కుండ్లీలో టీడీఐ గ్రూప్ సహా పలువురు బిల్డర్లు పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా మురుగునీటిని నదిలోకి వదులుతున్నారు.
దీనిపై సమీప గ్రామాలకు చెందిన కిసాన్ ఉదయ్ సమితి 2018లో ఫిర్యాదు చేసింది. నదిలోకి మురుగునీటిని వదలడం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టింది. వారికి స్థానిక అధికార యంత్రాంగం సహకరిస్తోందని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ఆయా బిల్డర్ల తీరు తప్పుబట్టింది. టీడీఐ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కు రూ.95 కోట్లు జరిమానా విధించింది. అన్సాల్ ఏపీఐకి రూ.కోటి, పర్కర్ రెసిడెన్సీకి రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.