poulomi avante poulomi avante

హైదరాబాద్ లో హ్యాపినెస్ హబ్!

ఆనందం యొక్క చిరునామా.. ప్రకృతికి ఎంతో సమీపంగా మనసు… శరీరం… హృదయానికి ఆనందాన్ని అందించే సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ఆరంభం… అదే.. హ్యాపినెస్ హ‌బ్ @ కిస్మ‌త్ పూర్.. డెవ‌ల‌ప్డ్ బై.. గిరిధారి హోమ్స్‌!

హైదరాబాద్‌లో ప్ర‌తిఏటా బిల్డ‌ర్లు వంద‌లాది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కొన్నింట్లో స‌దుపాయాలు మెరుగ్గా ఉంటే.. మ‌రికొన్నింట్లో ప‌చ్చ‌ద‌నం ఆక‌ర్షిస్తుంది. అయితే, ఆనందాన్ని అందించే క‌ట్ట‌డాలు పెద్ద‌గా లేవ‌నే చెప్పాలి. అందుకే, న‌గ‌రంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా.. సంతోషాన్ని అందించే స‌రికొత్త గేటెడ్ క‌మ్యూనిటీ ఆరంభ‌మైంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే చాలు.. ఆనందమే ఆనందం.. ఎందుకో తెలుసా?

గిరాధారి చేప‌ట్టే ఏ ప్రాజెక్టును చూసినా.. ఏదో ఒక థీమ్ క‌లిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే?
యూఎన్ రిపోర్ట్ ప్రకారం 146 దేశాల్లో మనదేశం హ్యాపీనెస్లో 136వ స్థానంలో ఉంది. మనకన్నా చిన్న దేశాలైన భూటాన్ వంటి దేశాలు కూడా హాపీనెస్ అత్యుత్తమ స్థానాల్లో ఉన్నాయి. భూటాన్ దేశంలో జీడీపీ బ‌దులుగా గ్రాస్ డొమెస్టిక్ హ్యాపినెస్‌ను లెక్కిస్తారు. అంటే, అక్క‌డి ప్ర‌జ‌లు ఎంత సంతోషంగా ఉన్నార‌నే అంశాన్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇక యూఏఈలో అయితే హ్యాపినెస్ కోసం ప్ర‌త్యేకంగా ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. సంతోష‌క‌ర‌మైన స‌మాజాన్ని అభివృద్ధి చేసేందుకు ఏకంగా ఒక మంత్రి ప్ర‌త్యేక దృష్టి సారిస్తారు. గిరిధారి హోమ్స్ త‌మ వంతు సామాజిక బాధ్య‌త‌లో భాగంగా హ్యాపినెస్ సొసైటీని అభివృద్ధి చేయాల‌న్న కంకణం క‌ట్టుకుంది. కిస్మ‌త్‌పూర్‌లో హ్యాపినెస్ హ‌బ్ ను ఆర‌భించింది.
నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జామ్‌లు.. అధిక వాయు కాలుష్యం.. ర‌సాయన కాలుష్యం.. శబ్ద కాలుష్యం.. చిన్న చిన్న విష‌యాల్లో కొంద‌రితో గొడ‌వ‌లు.. ఇలాంటి అనేక కార‌ణాల వ‌ల్ల హ్యాపినెస్ అనేది క‌రువైంది. ప్రతీ మనిషి యొక్క కోరిక, తాపత్రయం సంతోషంగా ఉండటం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గజిబిజి, గందరగోళంతో అర్థం లేని జీవనశైలి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్ర‌మంలో.. ప్ర‌తిఒక్క‌రినీ దృష్టిలో పెట్టుకుని గిరిధారి హోమ్స్ హ్యాపినెస్ హ‌బ్ ప్రాజెక్టును డిజైన్ చేసింది. ఇందులోకి రాగానే ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు వంటివి మన సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. శ్వాస తీసుకునే విధానం మారిపోతుంది. ప్ర‌తిఒక్క‌రూ ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటారు.

అక్క‌డే ఎందుకు?

గిరిధారి హోమ్స్ గ‌త ప‌దిహేనేళ్లలో.. త‌మ ప్రాజెక్టుల‌న్నీ ఎక్కువ‌గా అప్పా జంక్ష‌న్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే చేప‌ట్టింది. ఇందుకు గ‌ల ప్ర‌ధాన కార‌ణం.. క‌నెక్టివిటీ! దుబాయ్ కానీ, మలేసియా కానీ, సింగపూర్ కానీ.. ఇలా అభివృద్ధి చెందిన ఏ న‌గ‌రాన్ని చూసినా.. ఎయిర్ పోర్టు నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే ర‌హ‌దారులే డెవ‌ల‌ప్ అయ్యాయి. ఈ సంస్థ మొద‌టి ప్రాజెక్టును ఆరంభించిన‌ప్పుడే.. ఔటర్ రింగ్ రోడ్డు ఆరంభ‌మైంది. దాంతో ఆ ప్రాంత‌మంతా ఫ్యూచర్ దుబాయ్ గా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని సంస్థ‌కు అర్థ‌మైంది. ఇలాంటి రోడ్ల‌లోనే ఎక్కువ‌గా హైరైజెస్‌లోనే ఉన్నాయి. అందుకే, ఈ సంస్థ అప్పా జంక్ష‌న్‌ను ఎంచుకుంది. ఈ ప్రాంతం ప్ర‌కృతికి చేరువ‌గా ఉండ‌టమే కాదు.. అభివృద్ధికి ఎక్కువ‌గా అస్కారం ఉంద‌ని గ్ర‌హించింది. ఎందుకంటే, 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హియాయత్ సాగర్ లేక్ స‌మీపంలో ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే.. 6 వేల ఎక‌రాల్లో మృగవని పార్కు, 3 వేల ఎక‌రాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6 వేల ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది. 30 శాతం కంటే ఎక్కువ గ్రామాలు కానీ, గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రానీ ఏరియా ఏదైనా ఉంటే అది ఇదేన‌ని అంచ‌నా వేసింది. పైగా, అతిత్వ‌ర‌లో మెట్రో రైల్వే స్టేష‌న్ ఇక్కడే ఏర్పాటు కానుంది. గిరిధారి ప్రాజెక్టు ముందు నుంచే వంద అడుగుల రోడ్డు కూడా అభివృద్ధి చేయ‌నున్నారు.

పేరులోనే ఆనందం!

హ్యాపినెస్ హ‌బ్‌.. ఈ పేరులోనే ఆనందం ఉంది.. కొనుగోలుదారుల‌కు చెప్పిన‌ట్లుగానే ఆనందాన్ని అందించేందుకు గిరిధారి సంస్థ ఎప్పుడూ ముందంజ‌లోనే ఉంటుంది. అందుకే, ఈ ప్రాజెక్టు కోసం ఎంతో వ్యూహాత్మ‌క‌ ప్రాంత‌మైన‌ కిస్మ‌త్ పూర్‌ను ఎంచుకుంది. ఇందులో నివ‌సించేవారు.. ప్ర‌తి సంబురాన్ని సంతోషంగా జ‌రుపుకోవ‌చ్చు.. చిన్నారుల బాల్యం ఆనందంగా గ‌డిచిపోతుంది.. ప్ర‌తిఒక్క‌రూ సంతోష‌మైన క‌బుర్లు చెప్పుకోవ‌చ్చు.. పెద్ద‌ల‌ సెకండ్ ఇన్నింగ్స్ ఆనందంగా ఆరంభం అవుతుంది.. కుటుంబంతో క‌లిసి సినిమాను ఆస్వాదించొచ్చు.. స్విమ్మింగ్‌, బ్యాడ్మింట‌న్‌, రిలాక్సేష‌న్‌, భ‌ద్ర‌త‌.. ఇలా ప్ర‌తి అంశంలోనూ ఆనందించాలంటే.. సంతోషాన్ని అందించే గృహాన్ని ఎంచుకోవాలి..

హ్యాపీ క్ల‌బ్ హౌజ్‌..

ఏ ప్రాజెక్టుకైనా క్ల‌బ్‌హౌజ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది. అందుకే, ఇందులోకి వచ్చేవారికి హ్యపీనెస్ను అందించాలనే ఉద్దేశ్యంతో.. హ్యాపీ బాడీస్, హ్యాపీ మైండ్స్, హ్యాపీ సోల్స్, హ్యాపీ హార్ట్స్ అనే సరికొత్త కాన్సెప్ట్ రూపొందించింది. ప్రాజెక్టులోని ట‌వ‌ర్ల‌కు ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత వంటి పేర్ల‌ను పెట్టారు. బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇలా న‌ల‌భైకి పైగా పేర్లు, హ్యాపినెస్‌ను ప్రేరేపించే చిహ్నాల‌ను ఎంచుకున్నారు. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. అందులో నివ‌సించేవారు ఎలాంటి ప్ర‌తికూల‌మైన మాన‌సిక ప‌రిస్థితిలో ఉన్నా.. వాటిని చూడ‌గానే మెద‌డులో ఆనందానికి సంబంధించిన ర‌సాయ‌నాలు వెలువ‌డ‌తాయి. ఆనందంగా ఉండ‌టం మ‌నిషి యొక్క నిజ‌స్వ‌రూపం. ఎల్ల‌ప్పుడు చిదానందంగా ఉండేలా ఆ స్వ‌రూపంలోకి తీసుకెళ్ల‌డ‌మే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

  •  క్లబ్ హౌస్ లో ప్ర‌త్యేకంగా హ్యాపీ మెమ‌రీ బ్యాంకు ఏర్పాటు చేశారు. సాధారణంగా అందరూ చెడుని గుర్తు పెట్టుకుని మంచిని మరచిపోతారు. ఈ నేపథ్యంలో హ్యాపీ మెమ‌రీ బ్యాంకులో ప్రతి ఒక్కరికీ ఓ లాకర్ ఇస్తారు. అందులో వారి వారి ఆనందానికి సంబంధించిన మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌న్నీ భ‌ద్రంగా దాచుకోవచ్చు. ఇలా మంచిని దాచుకోవడం వల్ల జీవితంలో పాజిటివిటీని గుర్తించ‌డానికి వీలు క‌లుగుతుంది. మొత్తానికి, క్లబ్ హౌస్ మొత్తం కూడా హ్యాపీనెస్ ఉట్టిపడేలా డిజైన్ చేయిస్తున్నారు.
  • ఇందులో అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా ఎక్కువే వ‌స్తుంది. ప్ర‌స్తుతం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల్లో వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ కొంటే.. క‌నీసం 40 గ‌జాల స్థ‌లం వ‌స్తుంది.

5 స్టార్ ఫెసిలిటీస్‌.. అధిక అప్రిసియేష‌న్

గిరిధారి ఇప్పటివరకు అప్పా జంక్షన్ లో 11 ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిని ఒక కోర్ పర్పస్ తో మొదలు పెట్టారు. కస్టమర్లు 5 స్టార్ ఫెసిలిటీస్ తో ఆనందమయ జీవితం గడపాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. గిరిధారి ప్రైస్ అప్రిసియేషన్ కూడా చాలా బాగుంది. గిరిధారి విల్లాలను రూ.90 లక్షలకు కొని రూ.4.25 కోట్లకు అమ్ముకున్నారు. వారి మూడు తరాల మొత్తం ఆదాయం కూడా అంత లేదని చెప్పారు. మినిమం 30 శాతం నుంచి మొదలుపెడితే గరిష్టంగా 400 శాతం ప్రైస్ అప్రిసియేషన్ అందుకున్నారు. ఇప్పటి వరకూ 2000 మంది హ్యాపీ కస్టమర్లు ఉన్నారు. 1000 హ్యాపీ ఫ్యామిలీస్ ప్రస్తుత ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లో ఉండ‌టం విశేషం.

హ్యాపినెస్ హ‌బ్‌
@ కిస్మ‌త్ పూర్‌
టీఎస్‌పీఏ జంక్ష‌న్ వ‌ద్ద‌
5.47 ఎక‌రాలు.. 3 ట‌వ‌ర్లు

చుట్టుప‌క్క‌ల ఆరు వేల ఎక‌రాల్లో ప‌చ్చ‌ద‌నం
హిమాయ‌త్ సాగ‌ర్ అందాల్ని వీక్షించొచ్చు
అత్యుత్త‌మ గాలి నాణ్య‌త‌
ప్ర‌త్యేకంగా మెమ‌రీ బ్యాంక్‌

ఇవే మీ హ్యాపీ చాయిసెస్‌..

  • హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు
  • ఇండోర్ బ్యాడ్మింట‌న్ కోర్టులు
  • జిమ్, ఇండోర్ గేమ్స్‌
  • జాగింగ్ ట్రాక్‌
  •  స్విమ్మింగ్ పూల్‌
  • చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా
  • కిడ్స్ ప్లే స్కూల్‌
  • థియేట‌ర్‌, టెంపుల్‌
  • బ్యాంకెట్ హాల్‌, కాఫీ షాపు..
    ఇంకా… ఎన్నో.. మ‌రెన్నో..

హ్యాపినెస్ హ‌బ్ నుంచి..

10 నిమిషాల్లో గ్లెండేల్ అకాడ‌మీ
15 నిమిషాల్లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌
20 నిమిషాల్లో బంజారా, జూబ్లీహిల్స్‌
25 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles