poulomi avante poulomi avante

ప్రకృతి పొరుగిల్లు.. సామ్ బౌలేవర్డ్

  • మోకిలలో అల్ట్రా లగ్జరీ విల్లాలు

ప్రకృతితో మమేకం కావాలనుకునేవారు తప్పనిసరిగా నగరానికి దూరంగా వెళ్లాల్సిందేనని అనుకుంటారు. ఆ హాయిని, పచ్చదనాన్ని ఎంజాయ్ చేయాలంటే సిటీ బయటకు వెళ్లక తప్పదనే భావనే చాలామందిలో ఉంటుంది. అలాంటి వాటికి సామ్ బౌలేవర్డ్ చెక్ పెట్టనుంది. ప్రకృతి ఒడిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించాలనుకునేవారికి ఇది నిజంగా ఓ వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోకిలలో 40 ఎకరాల స్థలంలో ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 300 చదరపు గజాలు, 400 చదరపు గజాలు, 475 చదరపు గజాల సైజుల్లో మొత్తం 270 విల్లాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల్లో అద్భుతమైన డిజైన్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. ఇక 48 వేల చదరపు అడుగుల్లో సమస్త సౌకర్యాలతో క్లబ్ హౌస్ కూడా అత్యద్భుతంగా రూపు దిద్దుకుంటోంది.

పూర్తిగా 4 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ స్కేపింగ్, ఔట్ డోర్ సౌకర్యాల కోసం రిజర్వు చేశారు. నగరంలోనే సుందరమైన గ్రామీణ వాతావరణం, విశాలమైన ఖాళీ స్థలాలు ఈ ప్రాజెక్టు సొంతం. అటు అందంతోపాటు ఇటు వినోద సౌకర్యాలు, ఔట్ డోర్ స్పోర్ట్స్, అద్భుతమైన కనెక్టివిటీ కలిగిన ప్రాంతం కూడా కావడంతో నిస్సందేహంగా ఇక్కడ నివసించొచ్చు. ఆహ్లాదకరమైన జీవితాన్ని అందంగా గడపాలనుకునేవారికి సామ్ బౌలేవర్డ్ చాలా అనువైన ప్రాంతం. ప్రశాంతంగా, పచ్చగా, విశాలంగా ప్రకతి ఒడిలో, ప్రకృతితో మమేకమైన ఈ ప్రాంతం భూలోక స్వర్గమే అంటే అతిశయోక్తి కాదు. బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఒత్తిడులన్నీ దూరమయ్యేలా ప్రశాంతమైన వాతావరణం మీకు కనిపిస్తుంది.

ఎన్నో సౌకర్యాలు..

కళ్లు చెదిరే రీతిలో అద్భుతంగా నిర్మాణమవుతున్న ఈ ప్రాజెక్టులో సౌకర్యాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. స్విమింగ్ పూల్, యోగా పార్క్, మెడిటేషన్ కోర్టు, ఔట్ డోర్ ఫిట్ నెస్ జోన్, హెర్బల్ గార్డెన్, జాగింగ్, వాకింగ్ ట్రాక్, రెఫ్లెక్సాలజీ పాత్, బాక్స్ క్రికెట్, స్కేటింగ్ రింక్, మల్టీ ప్లే కోర్టు, పిల్లల ఆటస్థలం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇక విల్లాలు బయట నుంచి ఎంత అందంగా కనిపిస్తాయో.. లోపల అంతకుమించిన ఆకర్షణీయతతో కళ్లను కట్టిపడేసేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలివీ..

  • రోజంతా అలసిపోయి కాస్త సేద తీరడం కోసం సెంట్రల్ పార్కు మీ కోసం వేచి చూస్తుంది. అక్కడి గార్డెన్ మీకు తాజా గాలిని ఇవ్వడమే కాదు.. ఆ వాతావరణం మీ మనసు దోచుకుంటుంది. అక్కడే ఇంకాసేపు ఉండాల‌నే ఫీలింగ్ కలిగిస్తుంది.
  •  పిల్లలు, యువకులు, పెద్దలు.. వయసుతో సంబంధంలో లేకుండా అందరూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ బయటే ఎక్కువ సమయం గడిపేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
  •  పచ్చని పరిసరాల్లో అద్భుతమైన విల్లాలు అందరి మది దోచుకోవడం ఖాయం. పూర్తి వాస్తుతో అద్భుతమైన డిజైన్ తో, చక్కని ఇంటీరియర్ తో అందరికీ నచ్చేలా వీటిని నిర్మిస్తున్నారు.
  •  మీ జీవనశైలిని ప్రతిబింబించే సమకాలీన విల్లాలివి. నిజమైన లగ్జరీ అనేది ఉత్తమమైన వాటి నుంచి ఎంచుకోవడంలోనే ఉంటుంది. ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ లో 4 విభిన్నమైన మోడల్స్ నుంచి మీకు సరిపోయే విల్లాను ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
  •  విలాసవంతం.. విశాలం.. ప్రత్యేకం.. ఇవీ సామ్ బౌలేవర్డ్ విల్లా విశిష్టతలు. మీ ఆకాంక్షలకు తగినట్టుగా, అందరి అభిరుచులకు తగ్గట్టుగా విలాసవంతంగా, విశాలంగా రూపు దిద్దుకుంటున్న ఈ విల్లాలు చాలా ప్రత్యేకతమైనవి.
  •  ఇక 48వేల చదరపు అడుగుల్లో అదిరిపోయే రీతిలో నిర్మితమవుతున్న క్లబ్ హౌస్ మరో అట్రాక్షన్. సామ్ బౌలేవర్డ్ క్లబ్ హౌస్ అన్ని వయసులవారికీ ప్రత్యేకంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి, ఆటలు ఆడటానికి చక్కని ప్రదేశమిది.

లోకేషన్ కూడా సూపర్..

లొకేషన్ పరంగా కూడా సామ్ బౌలేవర్డ్ ప్రాజెక్టు చక్కని ఏరియాలో ఉంది. విద్య, వైద్య, వినోద కార్యకలాపాలన్నీ సమీపంలోనే ఉన్నాయి. నగరంతో మంచి కనెక్టివిటీ కూడా ఉంది. ప్రాచీన్ గ్లోబల్ హైస్కూల్, ఇండస్ ఇంటర్నేషన్ స్కూల్ కేవలం 5 నిమిషాల కంటే తక్కువ దూరంలో ఉన్నాయి. బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్, సమష్టి ఇంటర్నేషన్ స్కూళ్లకు 10 నిమిషాలలోపు చేరుకోవచ్చు. ఇక్ఫాయ్‌కి
5 నిమిషాల కంటే తక్కువ సమయంలో, సీబీఐటీ, ఎంజీఐటీలకు 10 నిమిషాలలోపే వెళ్లొచ్చు. గోల్కొండ రిసార్ట్స్, స్కై జోన్ ట్రాంపొలైన్ పార్క్ లకు వెళ్లేందుకు ప‌ది నిమిషాలు ప్ర‌యాణిస్తే చాలు. శంకర్ పల్లికి 10 నిమిషాల్లో, కోకాపేట, గండిపేటలకు 15 నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఇక శంకర్ పల్లి రైల్వే స్టేషన్ కు 5 నిమిషాల్లో, నాగులపల్లి రైల్వే స్టేషన్ కు 10 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాల సమయం సరిపోతుంది. మరి ఇన్ని వసతులు కలిగిన ఈ ప్రాజెక్టులో విల్లా సొంతం చేసుకుని ప్రకృతితో సహజీవనానికి సంసిద్ధం కండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles