దక్షిణ భారతదేశంలో ప్లాట్ ప్రమోటర్ అయిన జీ స్క్వేర్ హైసింగ్.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. సాగర్ రోడ్డులోని బీఎన్ రెడ్డి నగర్, షాద్ నగర్ లో ఏర్పాటు కానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సమీపంలో తమ ప్రాజెక్టులు లాంచ్ కాబోతున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు ప్రీమియం ప్రాజెక్టులు అందిస్తున్నట్టు తెలిపింది. అందరికీ అవసమైన మౌలిక వసతులతోపాటు సమస్త సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. జీ స్క్వేర్ హౌసింగ స్పష్టమైన డాక్యుమెంటేషన్ తోపాటు ఐదేళ్ల ఉచిత నిర్వహణ ఇవ్వడం ద్వారా తమ వినియోగదారులకు ఎలాంటి సమస్యలూ లేని అనుభవాన్ని ఇచ్చినట్టు వివరించింది.
హైదరాబాద్ రియల్ మార్కెట్ లోకి జీ స్క్వేర్
G-Square Entered into Hyderabad Realty Market
ఇప్పటివరకు దాదాపు 4500 మంది వినియోగదారులకు 60కి పైగా ప్రాజెక్టుల్లో వెయ్యి ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి పంపిణీ చేసినట్టు తెలిపింది. ‘హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జీ స్క్వేర్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్. తమిళనాడు, కర్ణాటకల్లోని ఆరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ కోసం మా దగ్గర భారీ ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మాకు అతిపెద్ద జోన్ కానుంది’ అని జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఎన్.ఈశ్వర్ తెలిపారు. జీ స్క్వేర్ ప్రాజెక్టులన్నీ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లే. ప్లాట్ల విక్రయంతోపాటు నిర్మాణం కోసం అవసరమైన సలహాలు, సూచనలను కూడా జీ స్క్వేర్ అందిస్తోంది.