poulomi avante poulomi avante

జోరు మీద రియల్ రంగం?

  • పుంజుకున్న లీజింగ్ కార్యకలాపాలు
  • రెసిడెన్షియల్ రంగంలోనూ భారీగా అమ్మకాలు
  • కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం
  • సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి

రియల్ ఎస్టేట్ రంగంలో జోరు కొనసాగుతోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక వెల్లడించింది. సీఐఐ రియాల్టీ 2022లో ‘ఇండియన్ రియాల్టీ-చార్టింగ్ ది గ్రోత్ రోడ్ మ్యాప్ ఫర్ 2022’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను తెలిపింది. దీని ప్ర‌కారం.. 2022 మొదటి అర్ధభాగంలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో లీజింగ్ కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయి. ఇవి 2022 రెండో అర్ధభాగంలో మరింత పెరుగుతాయని అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ వినియోగం గత అంచనాల కంటే పెరిగింది. 2022 చివరి నాటికి 53 నుంచి 57 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుంది.

ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు 2022 మొదటి అర్ధభాగంలో 4 శాతం మేర పెరిగి 3.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022 చివరి నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. 2022లో రెసిడెన్షియల్ రంగం దశాబ్ద కాల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అమ్మకాలు, కొత్త లాంచ్ లు కలిసి 2 లక్షల మార్కును దాటే అవకాశం ఉంది. పారిశ్రామిక, లాజిస్టిక్స్ (ఐఅండ్ఎల్) రంగం వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధి సాధిస్తుంది. అలాగే లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది 28 నుంచి 32 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో ఉంటాయి. భారత్ లో ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు ప్రస్తుతం 6 మిలియన్ చదరపు అడుగులకు పైగా ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు కలిగి ఉన్నారు. 2025 చివరినాటికి ఇది 80 మిలియన్ చదరపు అడుగులు దాటుతుంది.

ఆఫీసు స‌ముదాయాల్లో పెరుగుద‌ల‌

భారతదేశం అంతటా మార్కెట్లు పూర్తిగా తిరిగి తెరుచుకోవడంతో ఆఫీస్ స్పేస్ కోసం ఎంక్వైరీలు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా 2022 రెండో త్రైమాసికంలో ఇది బాగా కనిపించింది. ఈ సమయంలో రికార్డు స్థాయిలో లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. 2022 రెండో త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ టేకప్ శాతం ఏకంగా 220 శాతం మేర పెరిగి 18.2 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. మొత్తంగా 2022 తొలి అర్ధ భాగంలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 29.5 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ఇది 53 నుంచి 57 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఇక సరఫరాపరంగా చూస్తే 2022 రెండో త్రైమాసికంలో 16.7 మిలియన్ చదరపు అడుగుల సరఫరా అదనంగా నమోదైంది. గతేడాది ఇదే కాలావధితో పోలిస్తే 64 శాతం అధికం. ఈ ఏడాది ఇప్పటివరకు అదనపు సరఫరా 26 మిలియన్ చదరపు అడుగులు దాటింది. రాబోయే త్రైమాసికాలలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా. మొత్తమ్మీద 2022లో సరఫరా అంచనాలు 54 నుంచి 58 మిలియన్ చదరపు అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇక ప్రధాన నగరాల్లోని అనేక మైక్రో మార్కెట్లలో 1 నుంచి 5 శాతం మేర అద్దెలో పెరుగుదల కనిపించింది.

ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్..

2022లో మొత్తం లీజింగ్ కార్యకలాపాలు దాదాపు 28 నుంచి 32 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో ఉంటాయని, వార్షిక ప్రాతిపదికన 12 శాతం వరకు వృద్ధి నమోదువుతుందని అంచనా. 3పీఎల్, ఎఫ్ఎంసీజీ, ఉత్పాదక ప్లేయర్ల నిరంతర విస్తరణ నేపథ్యంలో ఈ స్పేస్ టేకప్ జరుగుతుందని అంచనా వేశారు. అయితే, వార్షిక సరఫరా మాత్రం కాస్త తగ్గే అవకాశం ఉంది. 2022 రెండో అర్ధభాగంలో 25 నుంచి 28 మిలియన్ చదరపు అడుగుల కొత్త వేర్ హౌస్ లు పని చేస్తాయని అంచనా. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది 12 శాతం మేర పెరుగుతుంది. ఆఫ్ లైన్ స్టోర్లను తిరిగి తెరవడం వల్ల ఈ కామర్స్ ప్లేయర్ల నుంచి కొత్త స్థలం కోసం డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాలలో లీజింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.

షాపింగ్ మాళ్ల‌లో..

ఈ కామర్స్ నిరంతర వృద్ధి ఫలితంగా రిటైల్ రంగం బలమైన రికవరీ సాధిస్తోంది. 2022 తొలి అర్ధ భాగంలో లీజింగ్ కార్యకలాపాలు 1.54 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. వార్షిక ప్రాతిపదిక చూస్తే ఇది ఏకంగా 166 శాతం వృద్ధి నమోదు చేసింది. అనేక హోమ్ గ్రోన్ డైరెక్ట్ టూ కన్స్యూమర్ బ్రాండ్ల తమ ఫిజికల్ స్టోర్లను ప్రముఖ నగరాల్లో తెరవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో స్థలానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నారు.

రెసిడెన్షియల్ రంగం..

2022 మొదటి అర్ధభాగంలో అపూర్వమైన స్థాయిలో అమ్మకాలు, లాంచ్ లు జరిగాయి. పెరిగిన నిర్మాణ వ్యయాలను కొనుగోలుదారులపై మోపాలనే డెవలపర్ల నిర్ణయంతో పాటు రికార్డు స్థాయిలో అమ్మకాలు చాలా మైక్రో మార్కెట్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ జాబితా తగ్గింది. కొన్ని స్థానాల్లో మినహా దేశం మొత్తం ఇదే ఒరవడి ఉండటం విశేషం. కొత్త లాంచ్ లు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, అమ్మకాలు బలంగా ఉండటం ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఫలితంగా పాన ఇండియా స్థాయిలో ఇన్వెంటరీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇక డెవలపర్లు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఇళ్లపై దృష్టి పెడుతుండగా.. రూ.కోటి కంటే తక్కువ విలువ ఉన్న యూనిట్లకు డిమాండ్ అధికంగా ఉంది. కొత్త లాంచ్ లలో 1500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్ల వాటా ఎక్కువ ఉంటుండగా.. 500 చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగుల మధ్య పరిమాణం కలిగిన యూనిట్ల అమ్మకాలే అగ్రస్థానంలో ఉన్నాయి.

జోరుగా పెట్టుబడులు..

దేశంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 2022 మొదటి అర్ధ భాగంలో ఇవి 4 శాతం మేర పెరిగి 3.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 48 శాతం వాటాతో ఆఫీస్ సెక్టార్ పెట్టుబడుల పరంగా అగ్రభాగాన ఉంది. ఇక ఈ పెట్టుబడుల్లో సైట్ల అభివృద్ధి వాటా 33 శాతం ఉంది. రిటైల్ రంగంలో కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఈ విభాగం 13 శాతం వాటాను చేజిక్కించుకుంది.

ఫ్లెక్సిబుల్ స్పేసెస్..

2022 మొదటి అర్ధ భాగంలో ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు దేశంలో 6 మిలియన్ చదరపు అడుగులకు పైగా ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు కలిగి ఉన్నారు. 2025 చివరి నాటికి ఇది 80 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా. 2022 మొదటి అర్ధ భాగంలో దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుందని, ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకుంటున్న తరుణంలో అన్ని రంగాల్లో లీజింగ్ కార్యకలాపాలు మరింత ఎక్కువవుతాయని ఆశిస్తున్నట్టు సీబీఆర్ఈ చైర్మన్ అండ్ సీఈఓ అంశుమన్ మ్యాగ‌జీన్ తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles