poulomi avante poulomi avante

రిసెషనా? వీరికి సువర్ణావకాశమే!

వేణు భగవాన్
బిజినెస్ సక్సెస్ కోచ్,
మార్కెటింగ్ మెంటార్

మార్కెట్ ఢ‌మాల్‌.. కుదేల్‌.. సేల్స్ స్లో డౌన్‌.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..

ఇలాంటి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం న‌గ‌ర రియ‌ల్ రంగంలో నెల‌కొంది. అయితే, బిల్డ‌ర్లు మార్కెట్ బ్రహ్మాండంగానే ఉందంటారు. రాజ‌కీయ నాయ‌కులైతే గ‌ణాంకాల‌తో స‌హా మార్కెట్ దూసుకుపోతుందని సెంటిమెంట్‌ను బ్ర‌తికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీరి కంటే రెండు ఆకులు తిన్నారు.. జాతీయ‌, అంత‌ర్జాతీయ రియాల్టీ అధ్య‌య‌న సంస్థ‌లు. వీరు ఆధార‌ప‌డేది రియ‌ల్ సంస్థ‌ల మీదే కాబ‌ట్టి.. మార్కెట్ మెరుగ్గా లేక‌పోయినా.. ఫ‌లానా క్వార్ట‌ర్‌తో పోల్చితే ఈ త్రైమాసికంగా మెరుగ్గా ఉందంటూ పోటీప‌డి స‌ర్వే నివేదిక‌ల‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్రీలాంచుల రూపంలో కొంద‌రు రియ‌ల్ట‌ర్లు భారీగానే ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. కాక‌పోతే, నొయిడా బిల్డ‌ర్ల త‌ర‌హాలో వీరు కుప్ప‌కూలుతారా? లేక‌పోతే ఏళ్ల త‌ర‌బ‌డి ఫ్లాట్ల‌ను క‌డుతూ ఉంటారా? అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. ఈలోపు ఎంత‌మంది కొనుగోలుదారులు పోలీసు స్టేష‌న్ల మెట్లు ఎక్కుతారు? కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తార‌నేది త్వ‌ర‌లోనే తేలుతుంది. ఈ అంశాల‌న్నీ ప‌క్క‌న పెడితే, న‌గ‌రంలో 111 జీవో ర‌ద్దు భూములు అమ్మేవారికి, కొంద‌రు డెవ‌ల‌ప‌ర్ల‌కు కొత్త ప్లాట్ల‌ను తెచ్చి పెట్టింద‌ని చెప్పొచ్చు.

గ‌త కొంత‌కాలం వ‌ర‌కూ అమ్మ‌కాలు మెరుగ్గానే ఉన్న‌ప్ప‌టికీ.. రానున్న‌ది రిసెష‌న్ కాల‌మ‌నే విష‌యం రియాల్టీ పెద్ద‌ల‌ను కునుకు లేకుండా చేస్తోంది. మార్కెట్ మెరుగ్గా లేకున్నా.. ఒక అబ‌ద్దాన్ని వెయ్యి సార్లు చెప్పి మార్కెట్‌ను న‌మ్మించ‌వ‌చ్చు. కాక‌పోతే, వాస్త‌వాన్ని ముందు జాగ్ర‌త్త‌తో ప‌రిశీలించ‌క‌పోతే.. మొత్తం ప‌రిశ్ర‌మ‌కు ముందుంది మాంద్యం పండగే. అయితే, ఈ రిసెష‌న్‌ను ప్ర‌తికూలంగా కాకుండా.. సానుకూలంగా తీసుకునే వారికి స్వ‌ర్ణ‌యుగమ‌నే చెప్పాలి. ఎందుకో తెలుసా? రియల్ రంగంలో బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు ఉంటారు. బిల్డ‌ర్ అంటే భ‌వ‌నాల్ని నిర్మించేవార‌ని అనుకుంటారు. కానీ, బిల్డ‌ర్ బిల్డింగును నిర్మించ‌డు. మేస్త్రీయే క‌డ‌తాడు. బిల్డ‌ర్ చేయాల్సిన ప‌ని ఏమిటంటే.. త‌న ఆర్గ‌నైజేష‌న్‌ను క‌ట్టుదిట్టంగా నిర్మించాలి. మంచి క‌ల్చ‌ర్‌ను, నాయ‌క‌త్వ టీముల‌ను డెవ‌ల‌ప్ చేయాలి. డెవ‌ల‌పర్ అంటే ప‌చ్చ‌ని పొలాల్ని తీసుకుని జేసీబీ పెట్టి నున్న‌గా గుండు గీసేయ‌డ‌మేన‌ని అధిక శాతం డెవ‌ల‌ప‌ర్లు అనుకుంటారు. మార్కెట్ స్లో డౌన్ అయినప్పుడు ఇటువంటి వారికే మాంద్యం వస్తుంద‌ని మ‌ర్చిపోవ‌ద్దు. సిస‌లైన‌ బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్ల‌కు ఇంతకంటే సువర్ణావకాశం మరొకటి ఉండద‌ని గుర్తుంచుకోవాలి.

ఎవరికీ రిసెషన్?

  •  ఏ మాత్రం కొత్తదనం లేకుండా మూస పద్దతిలో వ్యాపారం చేసేవారికి
  •  సంస్థాగత నిర్మాణం చేయకుండా – వ్యక్తి యాజమాన్యంలో ఏక్ నిరంజన్ లా వ్యాపారం చేసేవారికి
  •  కస్టమర్ కు అర చేతిలో వైకుంఠం చూపించి – ఇచ్చిన వాగ్దానాలు బ్రోచర్లకే పరిమితం చేస్తే..
  •  నాసిరకం నిర్మాణాలు చేసేవారికి
  •  కస్టమర్లతో పాటు తమ ఉద్యోగులను, సేల్స్ టీమ్స్, సప్లయర్స్, వెండార్స్ ను గౌరవించనివారికి
  •  అత్యాశాపరులు.. మోసకారులు
  •  పర్మిషన్ లేకుండా – ప్రణాళిక లేకుండా – సామర్ధ్యం లేకుండా – గాలిలో మేడలు కట్టి అమ్మినవారికి
  •  ప్రయోజనం లేని వెంచర్లు వేసేవారు
  •  వ్యాపారంలో/ వ్యక్తిగతంగా ఆర్ధిక క్రమశిక్షణ, అంకిత భావం లేనివారికి

వీరికి రిసెషన్ సువ‌ర్ణావ‌కాశమే

  • మంచి ఉద్దేశ్యంతో పాటు ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకోవడానికి విలువలతో కూడిన నాయకత్వ సామర్ధ్యం ఉన్న టీములను నిర్మించుకున్నవారికి.
  • కస్టమర్లు, సరఫరాదారులు, ఉద్యోగుల వద్ద గుడ్ విల్ (విశ్వాసం) ఉన్న వారికి
  • సృజనాత్మకత ఉన్నవారికి
  • ప్రజల అవసరాలు – బాధలు తెలిసి వారికి తమ మేధస్సుతో , క్రియేటివిటీతో అవసరమైన అత్యుత్తమ ప్రాడక్ట్ అందుబాటు ధరలో అందించినవారికి
  • కస్టమర్ నుండి వచ్చిన ప్రతి రూపాయి ఒక బ్యాంకు ఫండ్ ఇచ్చినట్లు భావించి ఆ డబ్బును బాధ్యతగా ఖర్చుపెట్టేవారికి.

వ్యాపారాన్ని విస్తరించడంలో సువర్ణావకాశం

  • మంచి ల్యాండ్స్ ఊహించని ధరకు దొరుకుతాయి
  • డబ్బు చెల్లించడానికి సమయం ల‌భిస్తుంది
  • మార్కెటింగ్ కోసం ఉప‌యోగ‌ప‌డే హోర్డింగ్స్ వంటివి సరైన లొకేషన్ లో డిస్కౌంట్ ధరకు దొరుకుతాయి
  • టీం నిర్మించుకోవడానికి టాలెంట్ – అనుభవం ఉన్న వారు మంచి జీతాలకు దొరుకుతారు
  • హడావుడి తగ్గడం వలన కస్టమర్ కు నిజంగా ఏది కావాలో తెలుస్తుంది
  • బిల్డింగ్ కట్టడం నుంచి కమ్యూనిటీ నిర్మించడానికి అవసరమైన ఆలోచనలొస్తాయి
  • దేశం / ప్రపంచంలో ఎం జరుగుతుందో తెలుస్తుంది. వినూత్నమైన ప్రాజెక్టులను సందర్శించే వీలు లభిస్తుంది.
  • ఎక్కువ ఇన్నోవేషన్ వలన తక్కువ కాంపిటీషన్ ఉంటుంది
  • అద్భుతమైన ప్రాజెక్ట్ ఐడియా ను బ్లూ ఓషన్ స్ట్రాటజీ తో లాంచ్ చేస్తే.. సేల్స్ టీమ్స్ కస్టపడి సేల్స్ చేయడం నుంచి – కస్టమర్లు కొనుక్కోవడానికి సహాయపడే సేల్స్ కోఆర్డినేటర్స్ గా మారిపోతారు.

ఒక సంస్థ తమ ఉద్యోగుల, సరఫరాదారుల‌, కస్టమర్ల విశ్వాసం చూరగొనాలంటే.. గ్రీక్ ఫిలాసఫీ అయిన ఎథోస్ (Ethos), పాథోస్ (Pathos), లోగోస్ (Logos) ను ఎంతవరకు తమ సంస్థ కల్చర్ (సంస్కృతి) లో నిర్మించారనే దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. ఎథోస్ అంటే విశ్వసనీయత, విలువలు.. పాథోస్ అంటే భావోద్వేగాలు, అనుభూతులు.. లోగోస్ అంటే లాజిక్ మ‌రియు వివేకం అని గుర్తుంచుకోవాలి. కాక‌పోతే, ఇవ‌న్నీ ఒక్క రోజులో నిర్మిత‌మయ్యేవి కావు. కొంత‌కాలం వ్యూహాత్మకంగా ప‌ని చేసే స‌రైన నాయ‌క‌త్వం ఉన్న‌ప్పుడే నిర్మాణ సంస్థ‌లు దీర్ఘ‌కాలం నిల‌బ‌డ‌తాయి. ఒక చెట్టు చాలా బలంగా ఉందంటే వాటి వేర్లు అంత లోతుగా ఉన్నాయని అర్ధం.

అలాగే సంస్థాగత చెట్టు యొక్క వేర్లు అంటే వాటి విలువలు అన్నమాట. వేర్లు బలంగా ఉన్న చెట్టు పిల్ల గాలులకు నృత్యం చేస్తుంది, పెద్ద గాలులను తట్టుకుని నిలబడుతుంది. చెట్టుకు వేర్లు విలువలయితే.. పండు ఫలితాలు. చెట్టు యొక్క శాఖలు.. సంస్థకు సంబంధించిన‌ పలు విభాగాలు. చెట్టు యొక్క నీడ ఆ సంస్థ కీర్తి.. ఆ చెట్టుపై వాలే పక్షులు వారి టీం లీడర్లు.. ఆ నీడ క్రింద సేద తీర్చుకునే వారే కొనుగోలుదారులు. కాబ‌ట్టి, ఏ సంస్థకయినా ఒక సామాజిక ప్రయోజనం – ఒక మిషన్ గా మారినట్లయితే బోర్డు / టీం మీటింగులు కొత్త ఆలోచనలతో నిండిపోతుంది. ఆలోచనలు వారివే అయితే వాటిని ఆచరించడానికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక మిషన్ పై పని చేస్తారా? మెషిన్ లా (యంత్రం లా) పని చేస్తారా? కుట్టు మెషిన్ లా సాగదీస్తారా అన్నది ఆ సంస్థ టాప్ మేనేజ్‌మెంట్‌ ఉద్దేశ్యాలపై, నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

చెట్టుకైనా / సంస్థాగత చెట్టుకయినా వేర్లు బాగుంటేనే పండు రుచిక‌రంగా ఉంటుంది. ఊ అంటారా!! ఊ ఊ అంటారా !!

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles