- పెండింగ్ లో 6 వేలకు పైగా ఫిర్యాదులు
ఫిర్యాదుల పరిష్కారంలో మహారాష్ట్ర రెరా చాలా వెనుకబడి ఉంది. రాష్ట్రంలో రెరా అమల్లోకి వచ్చి ఆరేళ్లవుతున్నా.. ఇంకా 6,191 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులను గుర్తించే పనిలో రెరా ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేయడం ద్వారా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించవచ్చు కదా అని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. మహా రెరా వెబ్ సైట్ లో ఉన్న గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 19 వేలకు పైగా ఫిర్యాదులు రాగా, 12,961 ఫిర్యాదులను పరిష్కరించారు.
ఫిర్యాదులు విని ఉత్తర్వులు ఇచ్చినా.. 700 రికవరీ వారెంట్లు ఇంకా రెవెన్యూ అధికారులకు జారీ చేయాల్సి ఉందని ఓ కొనుగోలుదారు వెల్లడించారు. మరోవైపు ఎన్ని కేసులను పరిష్కరించారో వెబ్ సైట్ లో వివరాలు ఇచ్చినప్పటికీ, పెండింగ్ లో ఎన్ని కేసులు ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి అనేది ఎక్కడా తెలియజేయలేదు. ఈ గణాంకాలను పక్కనపెడితే, దాదాపు 90 శాతానికి పైగా ఉత్తర్వులు ఇంకా అమల్లోకి నోచుకోలేదని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.