-
అక్రమ వెంచర్లపై రెరా యాక్షన్ షురూ
-
అనుమతి లేని వెంచర్ల పేర్లను అధికారికంగా
ప్రకటించనున్న రెరా అథారిటీ
-
చేవేళ్లలో ఐదు వెంచర్లపై రెరా చర్యలు
-
రెజ్ న్యూస్ కథనాలపై రెరా స్పందన
అక్రమ వెంచర్లు, ప్రాజెక్టులపై చర్యల్ని తీసుకోవాలని కొంతకాలం నుంచి రెజ్ న్యూస్ కథనాల్ని ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెజ్ న్యూస్ కథనాలపై తెలంగాణ రెరా అథారిటీ స్పందించింది. రాష్ట్రంలోని అక్రమ వెంచర్లపై చర్యలకు ఉపక్రమించింది. రెరా అనుమతి లేని వెంచర్లు, ప్రాజెక్టుల వివరాల్ని ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయకూడదని రెరా తాజాగా హెచ్చరించింది. ఇన్వెస్ట్ ఇన్ ఎకర్స్ అండ్ బెనిఫిట్ ఇన్ స్వ్కేర్ యార్డ్స్ అంటూ స్వ్కేర్ యార్డ్ ఫ్యాక్టరీ అనే రియల్ సంస్థ అక్రమంగా ప్లాట్లను విక్రయిస్తుందని గుర్తించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని సేకరించింది. ఇందులో కొనుగోలుదారులు ప్లాట్లను కొనకూడదని హెచ్చరించింది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధుల నెంబర్ల (8074926830, 9848188856)ను రెరా వెల్లడించింది. వీరి వద్ద ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోకూడదని హెచ్చరించింది.