poulomi avante poulomi avante

స‌ర్వాంగ‌సుంద‌రంగా స‌రికొత్త రోడ్లు..

  • రూ.2,410 కోట్లతో
    104 రోడ్ల నిర్మాణం
  • తొలుత రూ.1500 కోట్లతో 5
    ప్యాకేజీల్లో 50 రహదారులు

హైదరాబాద్ నగర రహదారులపై ప్రభుత్వం దృష్టి సారించింది. జీహెచ్ఎంసీతో పాటు నగరం చెట్టూ ఉన్న పలు శివారు మున్సిపాలిటీల్లో రూ.2,410 కోట్ల వ్యయంతో 104 రోడ్ల నిర్మాణం, అభివృద్ధి చేపట్టనుంది. తొలుత ఐదు ప్యాకేజీల్లో రూ.1500 కోట్ల ఖర్చుతో 50 రహదారులను నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటికే ఉన్న పలు రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా కొన్ని చోట్ల రోడ్లు నిర్మించనున్నారు. బండ్లగూడ జాగీర్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, కొత్తూరు, శంషాబాద్, గాజుల రామారం, నిజాంపేట తదితర మున్సిపాలిటీల్లో ఈ రోడ్లు రానున్నాయి. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పనులు చేపట్టనుంది. ఇప్పటికే పలు పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచింది.

ప్యాకేజీ-1 కింద రహదారులివీ..

  • లంగర్ హౌస్ బాపూఘాట్ బ్రిడ్జి-పీఅంట్ టీ కాలనీ
  •  కొత్తూరు రైల్వే క్రాసింగ్-కుమ్మరిగూడ జంక్షన్
  •  కొత్తూరు వై జంక్షన్-వినాయక స్టీల్ ఫ్యాక్టరీ
  •  శంషాబాద్ బస్టాప్-ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్
  •  శంషాబాద్ రైల్వే స్టేషన్ క్రాసింగ్-ధర్మగిరి రోడ్డు
  •  ఎన్ హెచ్ 44 తొండుపల్లి-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు
  •  గొల్లపల్లి ఎన్ హెచ్-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు

ప్యాకేజీ-2 కింద రోడ్లు..

  •  ఆర్సీఐ క్రాస్ రోడ్డు-ఎయిర్ పోర్టు హోటల్ శ్రీశైలం హైవే
  •  మల్లాపూర్ క్రాస్ రోడ్డు-కుర్మల్ గూడ
  •  కుర్మల్ గూడ-నాదర్ గుల్
  •  బడంగ్ పేట మెయిన్ రోడ్డు-తుర్కయాంజల్ రామాలయం నాదర్ గుల్
  •  ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ జంక్షన్-ఆక్టోపస్
  •  ఇంజాపూర్-మునగనూర్
  •  తొర్రూర్-నాగార్జున సాగర్ రోడ్డు
  •  ఇన్నర్ రింగ్ రోడ్డు-డీఎల్ఆర్ఎల్ కాలనీ
  •  వనస్థలిపురం రోడ్డు-ఓల్డ్ హయత్ నగర్ రోడ్డు
  •  బడంగ్ పేట-నాదర్ గుల్ మెయిన్ రోడ్డు

ప్యాకేజీ-3 రహదారులు..

  •  దమ్మాయిగూడ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుంచి నాగారం మీదుగా ఈసీఐఎల్
  • – చేర్యాల జేఎన్ఎన్ యూఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్ గూడ వరకు
  •  ఫైరింగ్ కట్ట్ట-జవహర్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం
  •  ఎన్టీఆర్ విగ్రహం-దమ్మాయిగూడ రోడ్డు
  •  ఎన్టీఆర్ విగ్రహం-డంపింగ్ యార్డు
  •  ఎన్టీఆర్ విగ్రహం-వంపుగూడ రోడ్డు
  •  రాంపల్లి క్రాస్ రోడ్డు-సర్వే నెంబర్ 421 హెచ్ పీ పెట్రోల్ బంకు
  •  సర్వే నెంబర్ 421-యాన్మం పేట
  •  చర్లపల్లి-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వయా కటింగూడ
  •  యాన్మంపేట ఫ్లై ఓవర్-డబుల్ బెడ్రూం ఇళ్లు
  •  చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్-రాంపల్లి జంక్షన్
  •  యాన్మంపేట-ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు
  •  శివారెడ్డి గూడ-మాధవ్ రెడ్డి బ్రిడ్జి

ప్యాకేజీ-4 రోడ్లు ఇవే..

  •  ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్-కోకాపేట
  •  చేవెళ్ల రోడ్డు-రాధా రియల్టీ
  •  చేవెళ్ల రోడ్డు బాలాజీ నగర్-రాధా రియల్టీ రోడ్డు
  •  నార్సింగి అప్పా సర్వీస్ రోడ్డు-చేవెళ్ల రాధా రియల్టీ
  •  ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు-చేవెళ్ల రోడ్డు వయా కిస్మత్ పూర్
  •  వివేకానంద విగ్రహం కిస్మత్ పూర్ నుంచి ఆర్అండ్ బీ రోడ్డు ప్రెస్టీజ్ విల్లాల వరకు
  •  హనుమాన్ టెంపుల్, కైసర్ నగర్-మిథిలానగర్ (గాజులరామారం)
  •  అమీన్ పూర్ విలేజ్-మియాపూర్ హెచ్ఎంటీ కాలనీ
  •  బాచుపల్లి వీఎన్ఆర్ కాలేజీ-పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిజాంపేట
  •  ఎన్ హెచ్ 44 ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రాంరెడ్డి నగర్
  •  హనుమాన్ టెంపుల్-అపర్ణ హిల్ పార్క్

ప్యాకేజీ-5లో రోడ్లు..

  •  రాజ్ భవన్ రోడ్డు నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్
  •  ప్రకాశ్ నగర్-బ్రాహ్మణ్ వాడి రైల్వే ట్రాక్-వెల్ కిన్ పార్క్
  •  బైరాగిగూడ-నార్సింగి
  •  దర్గా-ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి
  •  ఫర్మాయిష్ హోటల్-తారామతి బారాదరి వయా కేంద్రీయ విహార్ అపార్ట్ మెంట్స్
  •  కుత్బుల్లాపూర్ రోడ్డు-పైపు లైన్ రోడ్డు వయా గోదావరి హోమ్స్
  •  కుత్బుల్లాపూర్ రోడ్డు-పైపు లైన్ రోడ్డు వయా సెయింట్ అంథోని స్కూల్
  •  ఎన్సీసీ జంక్షన్-అడిక్ మెట్ ఫ్లై ఓవర్
  •  ప్రగతి నగర్-మహదేవపురం వెటర్నరీ ఆస్పత్రి
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles