రెరా చట్టం సెక్షన్ 31 ప్రకారం రెరా అథారిటీ లేదా న్యాయనిర్ణేత అధికారికి ఫిర్యాదులు సమర్పించవచ్చు. రెరా కింద దాఖలు చేసే ఫిర్యాదు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాల చట్టాల ద్వారా నిర్దేశించిన రూపంలో ఉండాలి. చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఓ ప్రాజెక్టులో రెరా నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా జరిగితే అలాంటి అంశాలపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.
ఒకవేళ ఎన్సీడీఆర్సీ లేదా ఇతర వినియోగదారుల ఫోరంలో పెండింగ్ లో ఉనన్ విషయాల కోసం ఫిర్యాదుదారులు లేదా కేటాయింపుదారులు కేసును ఉపసంహరించుకోవచ్చు. సెక్షన్లు 12, 14, 18, 19 కింద ఫిర్యాదులను మినహాయించి ఇతర నేరాలపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.