-
లయాసెస్ ఫోరస్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్‌లో ఆరంభమైన కొత్త ప్రాజెక్టులతో పోల్చితే.. ఆశించినంత స్థాయిలో ఫ్లాట్లు అమ్ముడం కావట్లేదా అంటే ఔననే చెప్పొచ్చు. లయాసెస్ ఫోరస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత త్రైమాసికంలో.. భాగ్యనగరంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య సుమారు పదమూడు శాతం పెరిగింది. ఇది దేశంలోకెల్లా అధికం. మన తర్వాతి స్థానాల్లో 8 శాతంతో అహ్మదాబాద్, ఎంఎంఆర్ 7 శాతం, పుణె మరియు కోల్‌కతాలో 4 శాతం చొప్పున అన్‌సోల్డ్ స్టాక్ అధికమైంది. వార్షిక ప్రాతిపదిక లెక్కిస్తే.. కనీసం 42 శాతంగా నమోదైంది. తర్వాతి స్థానాల్లో 39 శాతంతో అహ్మదాబాద్, 29 శాతంతో ఎంఎంఆర్ వంటివి నిలిచాయి. అదే ఎన్సీఆర్, చెన్నై నగరాల్లో అమ్ముడు కాని ఫ్లాట్ల శాతం గణనీయంగా తగ్గింది. ఇది సుమారు పది శాతంగా నమోదైంది. తర్వాతి స్థానాల్లో బెంగళూరు (9 శాతం), పుణె (1 శాతం)లు నిలిచాయి. ఈ స్టాకును అమ్మాలంటే కనీసం ముప్పయ్ నెలలు పడుతుంది. గత త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు కేవలం ఏడు శాతమే పెరిగాయి. అదే కోల్‌కతాలో 40 శాతం, ముంబైలో 18 శాతం పెరగడం విశేషం. ధర విషయానికి వస్తే.. ఆరు శాతం పెరిగింది. అమ్మకాల రికవరిలో హైదరాబాద్ 41 శాతంతో ముందుంది.