poulomi avante poulomi avante

ప్రీలాంచ్ కంపెనీలపై ఐటీ నజర్?

Income Tax Department focus on pre launch companies linked up with BRS leaders

  • పలు కంపెనీల్లో సోదాలు
  • అధికార పార్టీ నేతలతో ఉన్న లింకులు తెలుసుకునేందుకేనా

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొంతమంది రియల్టర్లపై ఐటీ దృష్టి సారించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా వారి కుటుంబ సభ్యులతో సంబంధాలున్నాయని భావిస్తున్న రియల్టర్ల ఆఫీసులు, నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది. ఆయా సంస్థలు, కంపెనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా వారి కుటుంబ సభ్యులకు వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నాయని తెలియడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా గూగీ ప్రాపర్టీస్ సహా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు జరిపారు. దిల్ సుఖ్ నగర్, కొత్తపేటల్లోని గూగీ ప్రాపర్టీస్ తోపాటు ఆ కంపెనీకి చెందిన ఆదిభట్లలోని వండర్ సిటీ, మంగళ్ పల్లిలోని రాయల్ సిటీ, ఆదిభట్ల సమీపంలోని డాలర్ సిటీ, యాచారంలోని ఫార్మాసిటీ, యాదాద్రి సమీపంలోని పెరల్ సిటీ కార్యాలయాలతోపాటు హవర్స్, విహంగా ఇన్ ఫ్రా, గూగీ రియల్ ఎస్టేట్ కు చెందిన అనుబంధ కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. కంపెనీల ఆఫీసులతో పాటు గూగీ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ షేక్ అక్బర్ తోపాటు ఇతర డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది.

Income Tax Raid Update: घनाराम समूह के सीए का इलेक्ट्रानिक लाकर खोला, आयकर अफसरों ने जब्त किया पूरा कैश - Income Tax Raid officers seized cash found in electronic locker of CA

భూములు ధరలు ఎక్కువగా ఉన్న, భారీ హౌసింగ్, కమర్షియల్ వెంచర్లు వస్తున్న ఏరియాల్లోని రియల్టీ కంపెనీలపైనే ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీ నగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. రియల్టీ కంపెనీలు పొందిన భూములు కొందరు అధికార పార్టీ నేతలు, వారి సన్నిహితుల ఆధీనంలో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రియల్టర్లు, రాజకీయ నేతల మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పన్నుల ఎగవేత ఏమైనా జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా కొన్ని రియల్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Income Tax Raid: कानपुर के कत्था व्यापारी के ठिकानों पर आयकर विभाग का छापा, अब तक 50 लाख कैश मिला - Income Tax Department raid in Kanpur 50 Lakh cash recovered ntc - AajTak

ఐటీ దాడులను నిర్వహించిన కంపెనీలను గమనిస్తే.. ఆయా సంస్థలు గతంలో ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మిన విషయం తెలిసిందే. గత రెండు, మూడేళ్లలో ఆయా సంస్థలు పలు ప్రాజెక్టుల్లో బయ్యర్ల నుంచి నగదు తీసుకున్నారని తెలుసుకున్న ఐటీ విభాగం సోదాలను నిర్వహించింది. హైదరాబాద్ లో భువనతేజ, ఆర్ జే గ్రూప్, యోషితా ఇన్ఫ్రా, పారిజాత డెవలపర్స్, ఏవీ కన్ స్ట్రక్షన్స్, సీఎన్ఎన్ వెంచర్స్ వంటి కంపెనీలు ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించిన విషయం తెలిసిందే. మరి, ఈ సంస్థలపై ఐటీ నజర్ పడే అవకాశముందని సమాచారం
#HyderabadRealEstate
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles