- వన్ హైదరాబాద్ @ సోమాజిగూడ
- ఎర్రంమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే
- మొత్తం విస్తీర్ణం: 4.5 ఎకరాలు
- 3 ఎకరాలు: 24 అంతస్తుల్లో రెసిడెన్షియల్ టవర్లు
- 1.5 ఎకరాలు: 18 ఫ్లోర్లు గ్రేడ్-ఏ ఆఫీసు స్పేస్
- చేరువలోనే సచివాలయం, అసెంబ్లీ
- ఫైవ్ స్టార్ హోటళ్లు, షాపింగ్ మాళ్లు
మల్టీప్లెక్సులు, ఆస్పత్రులు.. అన్నీ దగ్గరే!
- సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు
- కూతవేటు దూరంలో రాజ్ భవన్
- ప్రప్రథమంగా బయోఫిలిక్ ఆర్కిటెక్చర్
- 24 అంతస్తుల్లో వర్టికల్ గార్డెనింగ్
- ప్రతి ఫ్లోరుకు కేవలం 2 ఫ్లాట్లే
- ఫ్లాటుకు 5 చొప్పున బాల్కనీలు
- మూడు నెలల్లో హ్యాండోవర్
మీరు సెంట్రల్ హైదరాబాద్‌లో నివసించాలని కలలు కంటున్నారా?
స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లు.. ఆధునిక సదుపాయాల్లేని భవంతులు కాకుండా.. ఫైవ్ స్టార్ లగ్జరీ సదుపాయాల్ని అందించే ప్రీమియం కమ్యూనిటీలో ఉండాలని భావిస్తున్నారా?
అయితే, మీలాంటి వారి కోసమే.. హై ఎండ్ కమ్యూనిటీ లివింగ్‌ను అందించే.. సరికొత్త ఆకాశహర్మ్యం సోమాజిగూడ మెయిన్ రోడ్డులో ముస్తాబైంది.
మరెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన ఫ్లాటును బుక్ చేసుకోండి. మూడు నెలల్లో మీ ఫ్లాట్ చేతికొస్తుంది కాబట్టి.. ఇంటీరియర్స్ పనుల్ని పూర్తి చేసుకుని.. సొంతింటి కలను సాకారం చేసుకోండి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంటి నుంచి రెండు అడుగులు వేస్తే చాలు.. ఆవరణలోనే ఉన్న గ్రేడ్ – ఏ ఆఫీసు స్పేస్‌లోకి ఎంచక్కా అడుగుపెట్టొచ్చు. మరి, విశ్వనగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్‌లో.. ఇంతకు మించిన మహత్తరమైన ప్రాజెక్టు లేదని చెప్పొచ్చు.
హైదరాబాద్‌లోని సోమాజిగూడ మెయిన్ రోడ్డు మీద.. ఎర్రంమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే.. దాదాపు 4.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. వాక్ టు వర్క్ కాన్సెప్టు తరహాలో.. ఫైవ్ స్టార్ రేటెడ్ లివింగ్ కావాలని కోరుకునే వారి కోసం.. అత్యాధునికంగా ముస్తాబైన సరికొత్త ఆకాశహర్మ్యమే వన్ హైదరాబాద్. ఇందులో మూడు ఎకరాల్లో హై ఎండ్ రెసిడెన్షియల్ స్పేసెస్, ఎకరంన్నరలో గ్రేడ్-ఏ ఆఫీసు సముదాయాన్ని అభివృద్ధి చేశారు. కోర్ హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా ట్విన్ టవర్స్ తరహాలో.. 24 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో.. ప్రతి ఫ్లోరుకు వచ్చేది కేవలం రెండంటే రెండే ఫ్లాట్లు. పైగా, ఒక్కో ఫ్లాట్ సైజు విస్తీర్ణం.. సుమారు 5000 చదరపు అడుగుల్లో ఉంటుంది. మూడో టవర్ అయిన సి బ్లాకును జి+6 అంతస్తుల్లో కడుతున్నారు. ఇందులో ప్రతి ఫ్లోరులో వచ్చేది కేవలం ఆరంటే ఆరే ఫ్లాట్లు. వీటి విస్తీర్ణం 3000+ చదరపు అడుగుల్లో ఉంటుంది.
బంజారాహిల్స్ వద్దు..
వన్ హైదరాబాద్ ముద్దు!
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగళాలుంటాయి. కానీ, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ అక్కడ సాధ్యమవుతుందా చెప్పండి.. ఫైవ్ స్టార్ రేంజ్ క్లబ్ హౌజ్, ఆధునిక స్విమ్మింగ్ పూల్, మోడ్రన్ జిమ్ వంటివి ఆయా పోష్ కాలనీల్లో లభించవనే విషయం తెలిసిందే కదా.. అందుకే, మారిన జీవనశైలికి అనుగుణంగా బయ్యర్లు వన్ హైదరాబాద్లో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకో తెలుసా?
- సోమాజిగూడ మెయిన్ రోడ్డులో నిర్మితమైన ప్రాజెక్టు ఇది. ప్రభుత్వ ఆఫీసులు చేరువగా ఉంటాయి. ఇక్కడ్నుంచి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీకి కానీ ఇట్టే చేరుకోవచ్చు
- వన్ హైదరాబాద్ ఎదురుగానే ప్రభుత్వం కొత్త అసెంబ్లీ భవనానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు వెనక వైపు రాజ్ భవన్ ఉంది
- పంజాగుట్ట సెంట్రల్ మాల్, జీవీకే షాపింగ్ మాల్, బిగ్ బజార్ వంటి షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్ థియేటర్లకు సులువుగా చేరుకోవచ్చు. ఎర్రంమంజిల్, పంజాగుట్ట మెట్రో మాళ్లకు హ్యాపీగా వెళ్లి రావొచ్చు
- అత్యవసరాల్లో నిమ్స్, ఇతరత్రా కార్పొరేట్ ఆస్పత్రులు, స్టార్ హోటళ్లు కూతవేటు దూరంలోనే ఉన్నాయి
నగరంలోనే ప్రప్రథమం
బయోఫిలిక్ ఆర్కిటెక్చర్
ప్రకృతిలో నివసించాల్సిన సమయం ఆసన్నమైంది. గతంతో పోల్చితే.. సహజసిద్ధమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగించాల్సిన తరుణమిది. కాకపోతే, మనమేం చేస్తున్నాం.. ప్రకృతితో సంబంధం లేకుండా నాలుగ్గోడల మధ్యే జీవిస్తున్నాం. ఇలాంటి ఇబ్బందిని అధిగమించడానికి ప్రణవ గ్రూప్.. వన్ హైదరాబాద్ ప్రాజెక్టులో బయోఫిలియా ఆర్కిటెక్చర్ ను ప్రవేశపెట్టింది. సుస్థిరమైన హరిత సూత్రాలను పాటిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ విధానాన్ని అవలంబించింది. దీని వల్ల.. వైవిధ్యమైన వృక్ష సంపద, ల్యాండ్ స్కేపింగ్ కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. ఇండోర్, ఔట్ డోర్ మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గిస్తుంది.
సహజసిద్ధమైన కాంతిని ఇంట్లోకి ప్రసరించేలా చేస్తుంది. సువాసనలు వెదజల్లే వాతావరణం కలిగిస్తుంది. ఎలివేషన్ కోసం కేరళ నుంచి తెచ్చిన ప్రత్యేక ఇటుకల వల్ల.. ఇంట్లో 3-4 డిగ్రీల వేడి తగ్గుతుంది. కుండలో పోసిన నీళ్లు ఎలా ఉంటాయో.. అలాగే ఇందులో నివసించేవారు ఉండొచ్చు. 75 మీటర్ల ఎత్తులో అభివృద్ధి చేస్తున్న వర్టికల్ గార్డెన్ ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పైగా, మొత్తం నిర్మాణం వచ్చేది కేవలం 29 శాతం స్థలంలోనే.. మిగతా 71 శాతంలో పచ్చదనానికి, ఓపెన్ స్పేసెస్‌గా పెట్టారు. విశాలమైన బాల్కనీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లాటుకు ఐదు బాల్కనీలు ఉంటాయి. అవన్నీ బెడ్‌రూములకు అటాచ్ అయ్యి ఉండటం విశేషం.
గ్రేడ్-ఏ ఆఫీసు స్పేస్
సెంట్రల్ హైదరాబాద్‌లో గ్రేడ్ -ఏ ఆఫీసు స్పేస్ కావాలని కోరుకునే వారికి అన్నివిధాలుగా నప్పే నిర్మాణమే.. వన్ హైదరాబాద్. సుమారు ఎకరంన్నర స్థలంలో 18 అంతస్తుల ఎత్తులో ఈ ఆఫీసు సముదాయాన్ని కడుతున్నారు. ప్రతి ఫ్లోరులో దాదాపు 27000 చదరపు అడుగుల స్థలముంటుంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇవన్నీ వన్ హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలేమిటో తెలుసా?
- సెంట్రల్ హైదరాబాద్‌లో ఉండటం. ఇక్కడ్నుంచి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు సులువుగా చేరుకోవచ్చు. పైగా వాక్ టు వర్క్ కాన్సెప్టును ప్రతిబింబించే ఫైవ్ స్టార్ రేటెడ్ ప్రాజెక్టు ఇది
- మెట్రో కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే అటు ఎల్ బీనగర్ అయినా ఇటు ఉప్పల్ అయినా సులువుగా మెట్రో ద్వారా వన్ హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. అంతెందుకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి కానీ మాదాపూర్ నుంచి కానీ సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఇక కొత్తగా ఆరంభించిన మెట్రో అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగినవారెవ్వరైనా.. వన్ హైదరాబాద్‌కు సులువుగా చేరుకోవచ్చు. ఇలాంటి సానుకూలాంశాల్ని గమనించాకే.. బడా ఐటీ దిగ్గజ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఇందులో కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తున్నాయి
ఆర్గానిక్ ఫార్మింగ్..
ఆర్గానిక్ కమ్యూనిటీ ఫార్మింగ్ చేయాలంటే మీరు ఎక్కడో శివారు ప్రాంతాలకు వెళ్లాలి. లేదా మారుమూల ప్రాంతాల్లో ఉండే విల్లాల్లోనైనా నివసించాలి. అయితే, వన్ హైదరాబాద్ ఉండగా.. మీకెందుకు బెంగా.. ఎంచక్కాసెంట్రల్ హైదరాబాద్‌లోనే మీకూ కమ్యూనిటీ ఫార్మింగ్ అనుభవాన్ని అందిస్తుంది.. వన్ హైదరాబాద్.ఫైవ్ స్టార్ రేంజ్ క్లబ్ హౌజ్
ఇందుకోసం జి+2 అంతస్తుల ఎత్తులో 25000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఫైవ్ స్టార్ తరహా క్లబ్ హౌజు పక్కనే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌ఫినిటీ పూల్, పూల్ క్లబ్ హౌజ్, బ్యాడ్మింటన్, ప్లే ఏరియాలు, మినీ సినిమా థియేటర్, ఏసీ జిమ్, 24/7 కేఫ్, యూనీసెక్స్ సెలూన్, యోగా రూమ్ వంటి ఆధునిక సదుపాయాలకు వన్ హైదరాబాద్‌లో కొదవే లేదు.
రెంట్ గ్యారెంటీ@ ఐదేళ్లు
మూడు నెలల్లో హ్యాండోవర్‌కు సిద్ధమవుతున్న వన్ హైదరాబాద్‌లో గ్రేడ్-ఏ ఆఫీసు సముదాయంలో స్పెషల్ ఆఫర్‌ను ప్రణవ గ్రూప్ ప్రవేశపెట్టింది. ఇందులో 1200 చదరపు అడుగుల్లో ఆఫీసు సముదాయాన్ని కొనుగోలు చేసేవారికి చదరపు అడుక్కీ రూ.60 చొప్పున సుమారు ఐదేళ్ల పాటు మీకు అద్దెను చెల్లిస్తుంది. కార్పొరేట్ ఆఫీసులకు అన్నివిధాల నప్పే స్ట్రాటజిక్ లొకేషన్‌లో వన్ హైదరాబాద్ ఉండటం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. హైదరాబాద్‌లో అనేక సంస్థలు ఇప్పుడిప్పుడే అద్దె గ్యారెంటీ అంటూ ప్రకటిస్తున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. పైగా, శివారు ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేందుకు మదుపర్లు ముందుకొస్తారో లేదో తెలియదు. కానీ, వన్ హైదరాబాద్ మూడు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు.