రెజ్ న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా ఝళిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంది.
నార్సింగి విలేజ్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవసరాల కోసం హెచ్ఎండిఏ ల్యాండ్ ఎక్విజేషన్ (LA) కింద సేకరించిన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలను హెచ్ఎండిఏ అధికారులు బుధవారం ఉదయం ధ్వంసం చేశారు. నార్సింగి విలేజ్ సర్వేనెంబర్లు 189, 205 పరిధిలోని జయభేరి సమ్మిట్ పక్కనే గల 3 గుంటల స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమించుకోవడానికి ప్రయత్నించగా.. హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా అడ్డుకుంది.