డబ్బులు తీసుకుని కూడా ఫ్లాట్లు అప్పగించకుండా మోసం చేసినందుకు నిర్మల్ లైఫ్ స్టైల్ కంపెనీకి చెందిన డెవలపర్లు ధర్మేష్ జైన్, రాజీవ్ జైన్ లను ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. 2011లో ఒలింపియా, పనోరమ, స్పిరిట్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు ఇస్తామని చెప్పి 34 మంది కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.11 కోట్లు వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం 2017లో వాటిని అప్పగించాలి. కానీ రోజులు గడుస్తున్నా ఫ్లాట్లు ఇవ్వలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డెవలపర్లను అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. మే 3 వరకు పోలీసు కస్టడీ విధించింది.