poulomi avante poulomi avante

మాస్ట‌ర్ ప్లాన్ ఖ‌రారు కాకముందే ఎస్టీపీలు?

  • 111 జీవో ప్రాంతాల్ని
    ఎలా డెవ‌ల‌ప్ చేస్తారు?
  • ఆ ఏరియా మాస్ట‌ర్ ప్లాన్
    పూర్త‌య్యిందా? లేదా?
  • దాంతో సంబంధం లేకుండా
    ఎస్టీపీల‌ను నిర్మిస్తారా?
  • మూసీపై ఎస్టీపీలు ఏమ‌య్యాయి?

ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్ జ‌లాశ‌యాలు కాలుష్యం బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ప్రాంతాన్ని హ‌రిత‌మ‌యం చేయ‌డానికి ప్ర‌త్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్ ను రూపొందిస్తామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌లుసార్లు ప్ర‌క‌టించారు. ఇందుకోసం బృహ‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని.. అందుకు అనుగుణంగానే ఆయా ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. గ‌త కొంత‌కాలం నుంచి చెబుతున్న ఈ మాట‌ల్ని నిజ‌మేన‌ని కొంత‌మంది ప్ర‌జ‌లూ భావించారు. కానీ, మాస్ట‌ర్ ప్లాన్ తో సంబంధం లేకుండానే.. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలో నాలుగు ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌డానికి గ‌త‌వారం పుర‌పాల‌క శాఖ‌ జీవోను విడుద‌ల చేసింది. ఇందుకోసం రూ.82 కోట్ల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్ని జారీ చేసింది.

విస్తుగొలిపే విష‌యం ఏమిటంటే.. 2016 నుంచి మురికి మూసిని సుజ‌ల‌రాశి చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. ప్ర‌త్యేకంగా మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా కొన్ని బ్యాంకుల నుంచి రుణాల్ని సైతం తీసుకుంది. కానీ, ఆ ప‌నుల పురోగ‌తిపై నేటికీ అధికారికంగా ఒక్క ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌లేదు. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలో నాలుగు ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌డానికి జీవోను విడుద‌ల చేసింది. మ‌రి, మాస్ట‌ర్ ప్లాన్‌లో భాగంగానే వీటిని ఏర్పాటు చేస్తున్నారా? లేక ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతానికి సంబంధించి విడిగా ఏమైనా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నారా? అనే అంశం తెలియాల్సి ఉంది. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాన్ని ఏ త‌ర‌హాలో అభివృద్ధి చేస్తారానే విష‌యంపై ప్ర‌భుత్వం కొంత స్ప‌ష్ట‌త ఇవ్వాలి.

ట్రిపుల్ వ‌న్ జీవో ప‌రిధిలోని 84 గ్రామాల‌పై తాజా ప‌రిస్థితిపై పుర‌పాల‌క శాఖ ఒక ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ జీవోను తొల‌గించిన‌ట్లేనా? అయితే, వాటిలో నిర్మాణాల్ని చేప‌ట్టేందుకు ఎవ‌రు అనుమ‌తిస్తారు? ప్ర‌స్తుతం ఈ జీవో ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో క‌డుతున్న‌వి అక్ర‌మ నిర్మాణాలా? ఎవ‌రైనా కొత్త‌గా ఇళ్ల‌ను క‌ట్టుకోవాల‌న్నా.. అపార్టుమెంట్లు నిర్మించాల‌న్నా ఎవ‌ర్ని సంప్ర‌దించాలి? ఇప్ప‌టికే నిర్మిస్తున్న‌వి అక్ర‌మ నిర్మాణాలుగా తేల్చేసి కూల్చివేస్తారా? లేక చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తారా? అనే అంశంపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles