poulomi avante poulomi avante

మూడంత‌స్తులు.. మ‌ట్టి రోడ్లు

ట్రిపుల్ వ‌న్ జీవోను మంత్రిమండ‌లి ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అయితే, ఈ ప్రాంతాన్ని కాంక్రీటు జంగిల్లా కాకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా అభివృద్ధి చేయాలి.

కంటోన్మెంట్ ఏరియా, బీహెచ్ఈఎల్‌, డీఆర్‌డీఎల్ వంటి అనేక కేంద్ర ప్ర‌భుత్వ సంస్థలు వందలాది ఎకరాల భూముల్లో ఉండటం.. నిర్మాణాలు తక్కువ ఏరియాలో.. చెట్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల.. న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం వెల్లివిరిస్తోంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వమూ ముందునుంచీ ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
111 జీవో ప్రాంతంలో ఇప్ప‌టికే గ్రీన‌రీ ఉంది. గండిపేట్, హిమాయత్ సాగర్ నిండిన‌ప్పుడు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ భూగ‌ర్భ‌జ‌లాలు పెరుగుతాయి. ప‌చ్చ‌ద‌నం అధిక‌మ‌వుతుంది. ట్విన్ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలో ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేశాక‌.. అక్క‌డ ఏయే త‌ర‌హా నిర్మాణాల‌కు ఎలా అనుమ‌తినిస్తార‌నేది కీల‌కం.
ఇక్క‌డ పావు ఎక‌రం, అర లేదా ఎక‌రం చొప్పున విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తినివ్వాలి. అందులో కేవ‌లం 15 నుంచి 20 శాతం నిర్మాణాన్ని, మూడంతస్తుల వరకే అనుమ‌తించాలి. మిగ‌తా స్థ‌లంలో చెట్ల‌ను పెంచాల‌నే నిబంధ‌న‌ను తేవాలి.రోడ్ల‌ను కాంక్రీటు జంగిల్ త‌ర‌హాలో వేయకుండా.. మ‌ట్టి రోడ్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించాలి. దాన్ని ప‌క్క‌నే చెట్ల‌ను పెంచాలి.
ప్ర‌తి ఇంటికీ చిన్న ఎస్టీపీని ఏర్పాటు చేసే.. ఆయా ఇంటికే వినియోగించాల‌నే నిబంధ‌న‌ను తేవాలి. లేక‌పోతే కొత్త ఇళ్లు వ‌స్తే.. అక్క‌డి డ్రైనేజీ నీళ్లు తాగునీటితో క‌లిసిపోతాయ‌నే భ‌యం వ‌ల్లే క‌దా ఇంత‌వ‌ర‌కూ అక్క‌డ నిర్మాణాల్ని అనుమ‌తించ‌లేదు.
ఇలా చేస్తే.. ఓ ప‌దేళ్ల త‌ర్వాత ఈ ప్రాంతాన్ని పైనుంచి చూస్తే ఎంతో అందంగా క‌నిపిస్తుంది.

భార‌త‌దేశంలోనే ల‌క్షకు పైగా ఎక‌రాల్లో ఇంత అందంగా ఏ ప్రాంత‌మూ క‌నిపించ‌దు. ఓఆర్ఆర్‌, ట్రిపుల్ ఆర్ మధ్యలో.. ట్విన్ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండటం, ఇది అత్యంత అద్భుతమైన పచ్చటి నగరంగా కనిపిస్తుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి.. 111 జీవో పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్ని ఏడాదికి రెండుసార్లు పైపుల ద్వారా నింపాలి. దీంతో ఇక్కడి భూగర్భజలాలు పెరుగుతాయి. తద్వారా పెద్దపెద్ద చెట్లు పెరుగుతాయి. అవి పెద్దగా అయితే, పది రెట్లు గ్రీనరీ పెరుగుతుంది.

– కె.ర‌వీంద‌ర్ రెడ్డి, ఛైర్మ‌న్‌, జ‌న‌ప్రియ ఇంజినీర్స్

అస‌మాన‌త‌లు తొల‌గాలి

84 గ్రామాల్ని 111 జీవో ప‌రిధిలోకి తెచ్చినా.. అనేక ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు, మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రులు, లేఅవుట్లు వెలిశాయి. అంటే, అక్ర‌మ నిర్మాణాల్ని నిరోధించ‌డంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ ప్రాంతాన్ని హ‌రిత‌మ‌యం చేసి ప‌రిర‌క్షిస్తూనే స‌రికొత్త రీతిలో అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 111 జీవో వ‌ల్ల ఇక్క‌డి రైతుల‌కు కొన్నేళ్ల నుంచి తీర‌ని అన్యాయం జ‌రిగింది. ప‌క్క‌నే ఉన్న కోకాపేట్‌లో ఎక‌రం న‌ల‌భై కోట్లు ఉంటే.. ఇక్క‌డి ప్రాంతాల్లో క‌నీసం నాలుగు కోట్ల‌ను మించ‌ట్లేదు. ఈ అస‌మాన‌త‌ల్ని తొల‌గించేందుకై రాష్ట్ర ప్ర‌భుత్వం 111 జీవోను ఎత్తేసింద‌ని అనిపిస్తోంది. 111 జీవోను తొల‌గించాక అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో రేట్లు పెరుగుతాయి. మిగ‌తా ఏరియాల్లో భూముల ధ‌ర‌లు త‌గ్గొచ్చు.

– గుమ్మి రాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌, క్రెడాయ్ నేష‌న‌ల్‌

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles