poulomi avante poulomi avante

అధిక రాబడి కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

రెసిడెన్షియలా లేక కమర్షియలా?

రియల్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఎదురయ్యే తొలి ప్రశ్న ఇదే. మన పెట్టుబడులపై అధిక ఆదాయం రావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే సందేహం తలెత్తుతుంది. రెసిడెన్షియల్ బెస్టా? లేక కమర్షియల్ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తారు. మరి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి కొన్ని అంశాల మీకోసం..

మన దేశంలో 2022 సంవత్సరం రియల్ రంగానికి సంతృప్తికరంగానే సాగింది. ముఖ్యంగా అటు రెసిడెన్షియల్, ఇటు కమర్షియల్.. రెండు విభాగాల్లోనూ చక్కని పురోగతి కనిపించింది. 2023లో ఇంతకుమించి వృద్ధి కనిపిస్తుందని పరిశ్రమ నిపుణుల అంచనా. మరి ఈ ఏడాది ఈ రెండు రంగాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో నిపుణులు చెబుతున్న అంశాలివీ..

రెసిడెన్షియల్ విభాగం..

  • సరఫరా పెరుగుతూనే ఉంటుంది. డెవలపర్లు మార్కెట్లలో ముందుకెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఫలితంగా సరఫరా పెరుగుతుంది.
  • సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత ఉంటుంది. అందువల్ల 2023లో ఇళ్ల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ కొనుగోలుపై రాబడి పొందడానికి రిటైల్ పెట్టుబడిదారులకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి.

వాణిజ్య విభాగం..

  • ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ విభాగం కంటే ఇధి కొంచెం భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు భారతదేశంలోని పెద్ద ఫార్మాట్ కార్యాలయాలకు ఆశనిపాతంగా మారాయి.
  • ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉన్న వినియోగ ధీమ్ కు మద్దతుగా ఉన్నందున బోటిక్ కార్యాలయాలు, రిటైల్ స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  • ఈ రంగంలో పెట్టుబడిదారులకు ఉత్తమ మార్గం.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులు. ప్రస్తుత విలువల ప్రకారం డివిడెండ్ చెల్లింపుల ద్వారా ఇవి సహేతుకమైన రాబడి అందిస్తున్నాయి.

వాణిజ్య విభాగం అనేక సంవత్సరాలుగా గణనీయమైన సంస్థాగత మూలధనాన్ని పొందుతోంది. ఇంకా గత రెండేళ్లుగా కొత్త ఆఫీసులు, రిటైల్ స్థలాల అభివృద్ధికి సంస్థాగత పెట్టుబడి పెరిగింది. గ్లోబల్ టెక్నాలజీ విభాగంలో గణనీయమైన సరఫరా

  • పెరుగుతుందంటే.. స్థిరమైన ఆక్యుపెన్సీతో కూడిన ఆస్తులను పెట్టుబడిదారులు కోరుకుంటున్నట్టు అర్థం.

పెట్టుబడి పెట్టే ముందు ఏం చూడాలి?
రిటైల్ పెట్టుబడిదారులు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నా.. అసలు పెట్టుబడి పెట్టే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో చూద్దామా?

  • పెట్టుబడి పెట్టబోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన డెవలపర్ ట్రాక్ రికార్డు చూడాలి. సాధ్యమైనంత వరకు ప్రముఖ డెవలపర్ల వద్దే మన సొమ్ము ఇన్వెస్ట్ చేయాలి. మైక్రో మార్కెట్ లో సదరు డెవలపర్ ట్రాక్ రికార్డు ఎలా ఉంది? సకాలంలో ప్రాజెక్టు డెలివరీ చేశారా? ఇతరత్రా అంశాలు ఏమైనా ఉన్నాయా అనేద పరిశీలించాలి.
  • రెరా ప్రకటనలు చూడాలి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో రెరా అమలవుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, టైమ్ లైన్, నిర్మాణ పురోగతి, భవనంలో ఇప్పటికే జరిగిన విక్రయాలు, ఆస్తికి సంబంధించి పూర్తి వివరాలను రెరా ద్వారా తెలుసుకోవాలి. రెరాలో నమోదు చేసుకోని బ్రోకర్లు, మధ్యవర్థులను గుడ్డిగా నమ్మొద్దు.
  • మైక్రో మార్కెట్ లో ప్రస్తుత ధర లేదా అద్దె గురించి తెలుసుకోవాలి. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. అనేక వెబ్ సైట్లు, టెక్ ప్లాట్ ఫారమ్స్.. వివిధ రకాల ప్రాజెక్టుల్లోని ధరల ట్రెండ్ ఎలా ఉందో విశ్లేషించి పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తాయి. వాటిని చూడటం ద్వారా ఓ అవగాహనకు రావొచ్చు.
  • ఇల్లు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత ఎంత డౌన్ పేమెంట్ చేయగలరో అంచనా వేసుకోవాలి. దానికి తగినట్టుగా ఫైనాన్స్ ప్రణాళిక వేసుకోవాలి. యూనిట్ మొత్తం ఖర్చులో స్టాంపు డ్యూటీ, జీఎస్టీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సౌకర్యాల శ్రేణితో ఉండే కొత్త భవనాలకు సంబంధించి నెలవారీ మెయింటనెన్స్ బిల్లు ఎక్కువగా ఉంటుంది. దీనిని కూడా గుర్తుంచుకోవాలి.
  • క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోవాలి. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ప్రతికూలతలు లేకుండా చూసుకోవడం కోసం గత 12 నెలల ఖర్చులను వీలైనంత తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles