- ఇల్లు కొని అందులో ఉండటానికే ఎక్కువ మంది సంపన్నుల మొగ్గు
భారతదేశంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో 22 నుంచి 25 శాతం మొత్తాన్ని తాము ఉండాలనుకుంటున్న ఇంటి కొనుగోలుకే వెచ్చిస్తున్నట్టు నైట్ ఫ్రాంక్ తాజా సర్వే వెల్లడించింది. రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన 18-35 సంవత్సరాల వయస్సు గలవారిలో 89 శాతం మంది సంపన్న భారతీయులు తమ ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడం కంటే అందులో తాము ఉండటానికే మొగ్గు చూపిస్తున్నట్టు తెలిపింది. కోటి డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తుల కలిగి ఉన్న భారతీయ అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ సంపదలో 22 నుంచి 25 శాతాన్ని తాము నివసించాలనుకునే ప్రధాని ఇంటికి కేటాయించే అవకావం ఉందని.. వారి హోల్డింగ్‌లలో 80-90% దేశంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ రీసెర్చ్ డైరెక్టర్ వివేక్ రాఠి తెలిపారు.
భారతదేశంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 2024లో 6% పెరిగి 80,686 నుంచి 85,698కి చేరుకుందని.. బిలియనీర్ల సంఖ్య 191కి పెరిగిందని వెల్త్ రిపోర్ట్ పేర్కొంది. 2028 నాటికి వారి సంఖ్య 93,753కి పెరుగుతుందని అంచనా. హెచ్ఎన్ఐల పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకే వస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల విషయానికొస్తే, “ఎక్కువ మంది హెచ్ఎన్ డబ్ల్యూఐలు యూఏఈ లేదా యూకే వంటి దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 47% మంది లగ్జరీ కార్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుండగా.. 28% మంది హై-ఎండ్ ప్రాపర్టీలలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఇష్టపడుతున్నారని తేలింది.