- ఫ్యూచర్ సిటీ అభివృద్ధి
కోసం కొత్త అథారిటీ..
తెలంగాణ మంత్రిమండలి పట్టణాభివృద్ధికి సంబంధించి ఇటీవల పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నది. ముందే ఊహించినట్లుగా.. ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఇందులో 7 మండలాలు, 56 గ్రామాల్ని కలుపుతారు. నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్నితీసుకుంది. ఈ 36 గ్రామాలను హెచ్ఎండీఏ పరిధి నుంచి తొలగించి ఎఫ్‌సీడీఏకు అప్పగిస్తారు. ఈ విభాగంలో పని చేసేందుకు రెగ్యులర్, అవుట్ సోర్సింగుతో కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఇందులో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలుంటాయి. ఫలితంగా, హెచ్ఎండీఏ పరిధి పెరుగుతుంది. తాజా నిర్ణయం వల్ల.. హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు కలుస్తాయి.