poulomi avante poulomi avante

ఫ్యూచర్ సిటీ 4.0 కోసం ప్రత్యేక అథారిటీ?

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి ఫ్యూచర్ సిటీ మరో మణిహారం కాబోతోంది. గ్రేటర్ సిటీ శివారు ప్రాంతం ముచ్చర్లలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం అవ్వగా.. ఏఐ సిటీ నిర్మాణానికి ప్రణాళికల్ని రేవంత్ సర్కార్ సిద్ధం చేస్తోంది . ఈ క్రమంలోనే భవిష్యత్తు నగర ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా.. అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా అథారిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయ‌నున్న‌ది.

ఫ్యూటర్ సిటీని అన్ని వర్గాలకు అనువుగా ఉండే నగరంగా నిర్మించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే ఫోర్త్‌ సిటీ కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆ ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా అథారిటీ పని చేయనుంది. ఈ అథారిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వం వహించనున్నారని సమాచారం. ఫోర్త్‌ సిటీని ప్రెస్టిజియస్‌గా డెవలప్‌ చేయాలని భావిస్తోన్న సర్కార్‌… హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేయాలని నిర్ణయించింది.

ఫోర్త్ సిటీ కోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌తో పాటు ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, గ్రేటర్‌ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. కొత్త నగరంలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ ఆధీనంలో పని చేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకుంటార‌ని తెలిసింది. భవిష్యత్తు నగరంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి ప్రైవేట్ సంస్థలు రాబోతున్నాయి. అందుకే అన్నింటి మధ్య సమన్వయం చేస్తూ.. పేద, మధ్య తరగతి వారికి సైతం ఫ్యూచర్ సిటీలో స్థానం కల్పించేలా అధారిటీ పని చేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యిది. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్‌ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వరకు మెుత్తం 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హెచ్‌ఎండీఏ ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను కూడా రూపొందించింది. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేస్తున్న అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కొంగరకలాన్, కప్పపహాడ్, ఫిరోజ్‌గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాలను తీసుకొస్తార‌ని సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావటంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles