- నా కలల సౌథం అలా ఉండాలి
- రియల్ ఎస్టేట్ గురుతో నటి గాయత్రీ భరద్వాజ్
టాలీవుడ్ నూతన నటి, టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ గాయత్రీ భరద్వాజ్ ఎత్తైన నిర్మాణాల్లో నివసించడానికే ఇష్టపడతారని వెల్లడించారు. ‘మేం దానిని రో హౌస్ అని పిలుస్తాం. నేను ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాను. ఇది ఒక అందమైన వ్యవస్థ. నా జీవితంలో ఉమ్మడి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యతను ఎప్పటికీ మరచిపోను. అందులో ఐకమత్యం ఉంటుంది. నేను కుటుంబ విలువలను గుర్తిస్తాను. నమ్మకమైన కుటుంబ సభ్యులతో ఆనందమయ జీవితం గడుపుతున్నాను. ఇక్కడ ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. అన్ని అంతస్తులూ మావే’ అని పేర్కొన్నారు. నటిగా మినిమలిజం ఆమెకు చాలా అసరం. సింపుల్ డిజైన్ ఎలిమెంట్స్ ని ఉపయోగించడం, గాయత్రి ఎవరో ఏ అలంకారమూ వెల్లడించకపోవడమే ప్రత్యేకత. ఆమె ఇంటీరియర్ డిజైన్ కోసం ఇదో ట్రెండింగ్ లుక్. దీని గురించి గాయత్రి ఇంకా చెబుతూ..
‘నా బెడ్ రూమ్ ఎంతో మినిమలిస్ట్ గా ఉండాలి. సింపుల్ డిజైన్ అద్భుతంగా ఉంటాయి. మీరూ ప్రయత్నించండి. అవసరమైనవాటి కోసం మిగిలిన అన్నింటినీ తీసేయడం నాకు ప్రశాతంత కల్పిస్తుంది. తద్వారా అక్కడ ప్రశాంతమైన ప్రదేశం ఏర్పడుతుంది. నా రోజు సానుకూల దృక్పథంతో ప్రారంభమవుతుంది. నాది మిధునరాశి. రెండు ప్రపంచాల కలయికను కలిగి ఉన్నాను. కానీ మినిమలిజం అనేది నేను తరచూ బిజీగా ఉన్న, చిందరవందరగా ఉన్న ప్రపంచం నుంచి విశ్రాంతినిస్తుంది’ అని వివరించారు.
ఎకరం సొంత స్థలంలో స్టైలిష్, సమకాలీనమైన భారీ ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. అయితే, ఇది చాలా సవాల్ తో కూడుకున్న పని అని ఆమెకు తెలుసు. కానీ ఆమె తన ఊహాత్మక సామర్థ్యాలకు పదును పెట్టాలనుకుంటున్నారు. ముఖ్యంగా అంత భారీ స్థలాన్ని డిజైన్ చేయడమే పెద్ద టాస్క్. ‘చుట్టూ కొండలు. మధ్యలో నా ఇల్లు. అందులో ఓ నీటి కొలను. వాస్తవానికి ఇదీ నా కల. అయితే, ఇది సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ నా పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా ఫ్లాట్ ని ఫ్లాట్ లా భావించడం నాకు ఇష్టం లేదు. నా కలల ఇంటిని నిర్మించుకోవడానికి సిద్దంగా ఉన్నప్పుడు వీటి గురించి ఆలోచిస్తుంటాను.
నా కలల సౌధంలో వార్డ్ రోబ్ క్లోసెట్, మేకప్ స్టూడియో, ఆటోమేటిక్ పాప్ కార్న్ మేకర్ తో కూడిన హోమ్ థియేటర్ హాల్ తప్పనిసరిగా ఉండాలి’ అని తెలిపారు. కొత్త ఇంటికి వెళ్లడం అనేది ఆమె జీవితంలోని గొప్ప ఆనందాలలో ఒకటిగా ఉంటుంది. ‘నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నేను దీన్ని వృత్తిపరంగా చేపట్టాలనుకున్నాను. మా అమ్మ నాకు పని చేయడానికి చిన్న ప్రాజెక్టులు ఇచ్చేది. ఆమె ఇంటిని నిర్మించడానికి కూడా ఇష్టపడుతుంది. ఆమె మా ఇంటి ఇంటీరియర్లను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి నేను నా జీవితమంతా ఆస్తెటిక్స్ చేయాలనే మనస్తత్వాల చుట్టూ పెరిగాను. నా కలల ఇంట్లో నా వ్యక్తిగత శైలి ప్రతిబింబించాలని అనుకుంటున్నాను. నాకు ఎలాంటి గందరగోళం ఉండకూడదు’ అని స్పష్టం చేశారు.
గాయత్రికి నటి ఆలియా భట్ ఇల్లంటే చాలా ఇష్టం. ‘అది న్యూయార్క్ తరహా లాఫ్ట్ ఫ్లాట్. ఆమె అపార్ట్ మెంట్ చాలా ఫాన్సీ లేదా మోడ్రన్ గా ఉండదు. టీల్ బ్లూ డబుల్ డోర్లు తొలుత చూస్తాం. ఇల్లు మొత్తం తెల్లటి రంగులో ఉంటుంది. వైట్ కాన్సెప్ట్ కొనసాగుతున్నప్పుడు మిర్రర్ ఫ్రేమ్ లు సెంటర్ స్టేజ్ తీసుకుంటాయి. ఇది చాలా విభిన్నంగా, చక్కని వ్యక్తిత్వంతో ఉంటుంది. నేను క్లాసీనెస్ ను కూడా ఇష్టపడతాను. అందుకే ఆలియా భట్ అంటే ఇష్టం’ అని వివరించారు. క్లాసిక్ డెకర్ పట్ల మొగ్గు కలిగిన వ్యక్తిగా విలాసవంతమైన కర్టెన్లతో అలంకరించిన ఫ్రేమ్ లు లేదా సూర్యరశ్మి పడుతున్న కిటికీలు, పాతకాలపు రగ్గులు గాయత్రీ భరద్వాజ్ శైలిని కొంతవరకు వర్ణిస్తాయి. అలాగే మినిమిలస్టిక్ గదులు, కాలంతో సబంధం లేని వస్తువులు ఆమె ఆకాంక్షలను ప్రతిఫలింపజేస్తాయి.