క్రికెటర్ యుజ్వేంద్ర సింగ్ చాహల్ ముంబై అంధేరి వెస్ట్ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షలకు లగ్జరీ అపార్ట్ మెంట్‌ను రెండేళ్లపాటు అద్దెకు తీసుకున్నారు. ఫిబ్రవరి 4న కుదిరిన ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇందుకోసం రూ. 10 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు.
మొదటి సంవత్సరం తర్వాత అద్దెలో 5% పెరుగుదల ఉంటుంది. 1399 చదరపు అడుగుల ఈ ప్రాపర్టీ అంధేరి వెస్ట్ లోని ట్రాన్స్ కాన్ ట్రయంఫ్‌లో ఉంది. నటి, సూపర్ మోడల్, టీవీ హోస్ట్, మాజీ మిస్ వరల్డ్ ఇండియా సూరి నటాషాకు చెందిన ప్రాపర్టీ అని తెలుస్తోంది. చాహల్ దేశీయ క్రికెట్‌లో హర్యానా తరపున, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.
ALSO READ: సింప్లిసిటీ, చక్కదనాల మేళవింపు.. జూనియర్ ఎన్టీఆర్ నివాసం
కాగా, ఫిబ్రవరి 2025లో కొరియోగ్రాఫర్, కంటెంట్ రైటర్ ధనశ్రీ, యుజ్వేంద్ర దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసిన తర్వాత విడాకుల గురించి ప్రచారం ప్రారంభమైంది. ఇది విస్తృతమైన ఊహాగానాలకు దారితీసింది. ఈ ఏడాది మార్చిలో వీరు విడాకులు తీసుకున్నారు. 2020 డిసెంబర్‌లో గురుగ్రామ్‌లో జరిగిన ఒక సన్నిహిత వేడుకలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.