poulomi avante poulomi avante

అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ.. అవంతిక ద ఎస్పినో

  • 7 ఎక‌రాల్లో 790 ఫ్లాట్లు..
  • జోరుగా నిర్మాణ ప‌నులు
  • డీల‌క్స్ ల‌గ్జరీ నిర్మాణం

ఐదు ఎక‌రాల్లో వెయ్యి ఫ్లాట్ల‌ను నిర్మించే బిల్డ‌ర్లు ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో.. ఏడు ఎక‌రాల్లో కేవ‌లం ఏడు వంద‌ల తొంభై ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్న సంస్థ అవంతిక క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌. ఈ సంస్థ చందాన‌గ‌ర్ చేరువ‌లోని అమీన్‌పూర్‌లో.. వాస్తు సూత్రాల‌కు అనుగుణంగా డీల‌క్స్ త‌ర‌హా నిర్మాణ‌మైన ద ఎస్పినో ప్రాజెక్టును ఆరంభించింది. ఇప్ప‌టికే కొన్ని బ్లాకుల్లో స్ట్ర‌క్చ‌ర్ ప‌ని పూర్త‌వ్వ‌డ‌మే కాకుండా బ్రిక్ వ‌ర్క్‌, ప్లాస్ట‌రింగ్, ఎల‌క్ట్రిక‌ల్ వంటి ప‌నుల‌న్నీ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రి, అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ ఫ్లాట్ల‌ను కావాల‌ని కోరుకునేవారికీ ప్రాజెక్టు చ‌క్క‌గా న‌ప్పుతుంద‌ని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. మ‌రి, ఈ ప్రాజెక్టు విశేషాల్ని చూస్తే.. మీరు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ద ఎస్పినో ప్రాజెక్టును త‌క్ష‌ణ‌మే సంద‌ర్శిస్తార‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

అవంతిక క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ సంస్థ చందాన‌గ‌ర్ చేరువ‌లోని అమీన్‌పూర్‌లో హెచ్ఎండీఏ నార్మ్స్ ప్ర‌కారం రెరా అనుమ‌తితో డెవ‌ల‌ప్ చేస్తున్న ప్రాజెక్టే.. ద ఎస్పినో. ఇందులో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు వ‌చ్చేవి 1084 నుంచి 1300 చ‌ద‌ర‌పు అడుగుల సైజులో కాగా.. ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ల‌యితే 1450 నుంచి 1700 ఎస్ఎఫ్‌టీలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు వ‌చ్చేవి ఈస్ట్ మ‌రియు వెస్ట్ ఫేసింగులోన‌ని గుర్తుంచుకోండి. ఇందులో క్ల‌బ్ హౌజ్‌ను 39 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో డెవ‌ల‌ప్ చేస్తున్నారంటే.. ల‌గ్జ‌రీ స‌దుపాయ‌ల‌కు ఈ ప్రాజెక్టులో ఎంత పెద్ద‌పీట వేస్తున్నారో ఈపాటికే మీకు అర్థ‌మై ఉంటుంది.

ద ఎస్పినో ప్ర‌త్యేక‌త ఏమిటంటే..అమ్మ‌కాల‌తో సంబంధం లేకుండా నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని కొనుగోలుదారులు భావిస్తున్నార‌నే విష‌యాన్ని అర్థం చేసుకున్న ఈ సంస్థ‌.. య‌మ‌స్పీడుగా నిర్మాణ ప‌నుల్ని జ‌రిపిస్తోంది. బ్లాక్ -ఏ టెన్ ఫ్లోర్స్ శ్లాబులు పూర్త‌య్యాయి. తొమ్మిదో అంత‌స్తులో బ్రిక్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఎల‌క్ట్రిక‌ల్ ప‌నులు జ‌రుగుతున్నాయి. బ్లాక్ -బిలో స్ట్ర‌క్చ‌ర్ పూర్త‌య్యింది. అంత‌ర్గ‌త ప‌నుల‌న్నీ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మౌలిక స‌దుపాయాల‌న్నీ చేరువ‌గా ఉండీ.. అభివృద్ధికి స‌మీపంలో నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్న ప్రాజెక్టు.. పైగా ఫ్లాట్ల సైజులతో పాటు ధ‌ర కూడా అందుబాటులో ఉండ‌టం వ‌ల్ల.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం సులువుగా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకునే వీలున్న ప్రాజెక్టే.. ద ఎస్పినో.
ఈ ప్రాజెక్టు నుంచి బీహెచ్ఈఎల్ సర్కిల్ ఒక‌టిన్నర కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. రెండు కిలోమీట‌ర్ల దూరంలో లింగంప‌ల్లి బ‌స్ టెర్మిన‌ల్‌, నాలుగు కిలోమీట‌ర్ల‌లో లింగంపల్లి రైల్వే స్టేష‌న్ ఉంటుంది. సినిమా థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సులు, షాపింగ్ సెంట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు వంటివ‌న్నీ స‌మీపంలోనే ఉంటాయి. ప్రాజెక్టులో ల్యాండ్ స్కేపింగ్, జాగింగ్ ట్ఆక్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా, టాట్ లాట్ ఏరియా వంటివ‌న్నీ చూడ‌చ‌క్క‌గా డెవ‌ల‌ప్ చేస్తారు. మీరు ఒక్క‌సారి ఈ ప్రాజెక్టును విజిట్ చేస్తే.. మీరు ఇందులో ఫ్లాట్ కొన‌కుండా ఉండ‌లేర‌ని క‌చ్చితంగా చెప్పొచ్చు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles