Categories: LATEST UPDATES

అమ్మకాల్లో అజ్మీరా రియల్టీ దూకుడు

  • 2022 క్యూ1లో 261 శాతం పెరుగుదల

ప్రాపర్టీ డెవలపర్ అజ్మేరా రియల్టీ అండ్ ఇన్ ఫ్రా ఇండియా అమ్మకాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు రూ.400 కోట్ల మేర అమ్మకాలు జరిపింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 261 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే క్యూ1కి సంబంధించిన వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే 93 శాతం మేర పెరిగి రూ.210 కోట్లకు చేరుకున్నాయి.

ఈ త్రైమాసికానికి సంబంధించిన సంస్థ నికర లాభం 13 శాతం పెరిగి రూ.12 కోట్లకు చేరింది. ‘వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగం సాఫీగానే సాగుతోంది. ఇది కంపెనీలకు సానుకూలంగా ఉంది. రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనే సెంటిమెంట్ క్రమంగా పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కూడా చాలామంది ఇటే మొగ్గు చేపుతున్నారు’ అని అజ్మేరీ రియల్టీ అండ్ ఇన్ ఫ్రా ఇండియా డైరెక్టర్ ధావల్ అజ్మేరా అభిప్రాయపడ్డారు.

This website uses cookies.