Categories: LEGAL

వ్యవసాయ భూమిలో అక్రమ కాలనీ

  • బిల్డర్, మరో ఎనిమిది మందిపై కేసు

వ్యవసాయ భూమిలో అక్రమంగా కాలనీ నిర్మించిన బిల్డర్ పై కేసు నమోదు కానుంది. మూడున్నర ఎకరాల సాగు భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా ఇళ్లు నిర్మించడానికి లేఔట్ వేయడంతోపాటు 21 మంది నుంచి అక్రమంగా భారీ స్థాయిలో సొమ్ము వసూలు చేసినందుకు బిల్డర్ తోపాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సహా మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని డీటీసీపీ ఫిర్యాదు చేసింది. గుర్గావ్ లోని ఫరూక్ నగర్ సెక్టార్ 3లో దీన్ దయాల్ జన్ ఆవాస్ యోజన కింద సవ్యసాచి ఇన్ ఫ్రాస్టక్చర్ ఓ రెసిడెన్షియల్ కాలనీ నిర్మిస్తోంది.

దీనికి ఆనుకుని ఉన్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా కాలనీ నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా పలువురు వ్యక్తులతో అమ్మకపు ఒప్పందాలు కూడా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీగా సొమ్ము వసూలు చేసింది. విషయం తెలుసుకున్న డీటీసీపీ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి అక్రమాలు నిర్ధారించారు. అనంతరం సదరు బిల్డర్ తోపాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

This website uses cookies.