-
గోపనపల్లి నుంచి తెల్లాపూర్ రోడ్డులో ప్రీమియర్ లైఫ్‌స్టైల్ ప్రాజెక్టు
-
తెల్లాపూర్ టెక్నోసిటీకి మొదటి దశ ఇది
-
లైవ్–వర్క్–ప్లే సంస్కృతికి ప్రతీక..
ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ చేతుల మీదుగా మై హోమ్ సయూక్ ప్రాజెక్టు ప్రారంభమైంది. నగరానికి చెందిన మై హోమ్ సంస్థ ప్రతిమ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోపనపల్లి తెల్లాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులో మొదటి దశగా వస్తోన్న మై హోమ్ సయూక్ ప్రాజెక్టుని 25.37 ఎకరాల్లో జీ+39 ఫ్లోర్లలో నిర్మిస్తోంది. మొత్తం 12 టవర్లు కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రతి ఫ్లోరుకు 8 ఫ్లాట్లు వస్తాయి. ఇలా మొత్తం 3780 ఫ్లాట్లు ఉంటాయి. వీటిలో 2, 2.5 మరియు 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం.. 1355 నుంచి 2262 చదరపు అడుగుల్లో ఉంటాయి.
అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్‌లో ఆరంభించిన ఈ ప్రాజెక్టుకి కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. నివాసితులకు మనశ్శాంతిని అందించే రీతిలో చక్కటి ప్రణాళికతో డిజైన్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రాంతమైన విప్రో జంక్షన్, గచ్చిబౌలిని కలపడంతో పాటుగా ఓఆర్‌ఆర్ మరియు ఎయిర్‌పోర్టుకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. హై ఎండ్ రెస్టారెంట్లు, స్కూళ్లు, షాపింగ్ మాళ్లు దగ్గర్లోనే ఉంటాయి. మై హోమ్ సయూక్ ప్రారంభోత్సవ సందర్భంగా మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డా. రామేశ్వర్ రావు మాట్లాడుతూ ‘‘ఆధునిక జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాలలో, కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా మై హోమ్ వెలుగొందుతుంది. ఆ నిబద్ధతకు కొనసాగింపు మై హోమ్ సయూక్ నిలుస్తుంద’ని అన్నారు.
ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణలు:
- 7.5 ఎకరాలలో సెంట్రల్ ల్యాండ్‌స్కేప్
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం
- ప్రతి టవర్‌కూ డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ
- ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్
- రానున్న ఇంటర్నేషనల్ స్కూల్, సయూక్ కు పక్కనే ఉండనుంది
- 2 రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులు
- ఉష్ణోగ్రతను నియంత్రించే స్విమ్మింగ్ పూల్