poulomi avante poulomi avante

వడ్డీ రేట్లపై మళ్లీ బాదుడు

  • రెపో రేటు అరశాతం పెంచిన ఆర్బీఐ

వడ్డీ రేట్లు మళ్లీ పెరగనున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ- రెపో రేటును మరో అర శాతం పెంచుతూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. గత నెల 4న రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ కీలక వడ్డీ రేటు 4.9 శాతానికి చేరింది. మూడు రోజుల భేటీ తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి రెపో రేటు పెంచిన తర్వాత పలు బ్యాంకులు తామిచ్చే వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా ఆర్బీఐ మరోసారి రెపో రేటు పెంచడంతో ఈ మేరకు బ్యాంకులు మళ్లీ తమ వడ్డీలను పెంచే అవకాశం ఉంది. అలాగే అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రేట్లు వరసగా 4.65 శాతం, 5.15 శాతానికి చేరాయి.

వడ్డీ రేటు పెంచిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ వడ్డీ రేటును 0.35 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రకటనకు ఒక రోజు ముందే హెచ్ డీఎఫ్ సీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలే వడ్డీ రేట్లను పెంచిన హెడ్ డీఎఫ్ సీ తాజాగా మరోసారి పెంచడంతో మొత్తం పెంపు 0.60 శాతానికి చేరింది. ఇప్పటివరకు ఏడాది ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు 7.50 శాతం ఉండగా.. తాజా పెంపుతో అది 7.85 శాతానికి పెరిగింది.

ఆర్థిక వ్యవస్థ బలంగా..

ఆర్బీఐ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో అది 4.9 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలంగా, రికవరీ మార్గంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉంది. రాబోయే నెలల్లో పెరిగిన గృహ రుణ రేట్లను బ్యాంకులు క్రమంగా వినియోగదారులపై మోపుతాయి. డిమాండ్ పునరుద్ధరణ కారణంగా చాలా మార్కెట్లలో ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్న సమయంలో గృహ కొనుగోలుదారులు ప్రస్తుత గృహ రుణ రేట్లను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
– రమేష్ నాయర్, సీఈఓ అండ్ ఇండియా ఎండీ, కొలీయ‌ర్స్

అనుకున్నట్టుగానే రేట్లు పెంచింది

అనుకున్నట్టుగానే ఆర్బీఐ పాలసీ రేట్లు పెంచింది. రెపో రేటు పెంపు వల్ల పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రిస్తారని, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధి సాధిస్తారని విశ్వసిస్తున్నాం. అదే సమయంలో హౌసింగ్ మార్కెట్లో డిమాండ్ వైపు పెద్ద ప్రభావం కనిపించడంలేదు. అది స్థిరంగా, బలంగా కొనసాగుతుంది. సరఫరా వైపు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేం ఆశాజనకంగా ఉన్నాం. సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు తిరిగి వస్తుంది.
– అమిత్ గోయల్, – సీఈఓ, సోతెబీ ఇంటర్నేషనల్ రియల్టీ,

ఆశ్చర్యం కలిగించలేదు

పాలసీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు. పైగా ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టడానికి మరిన్ని పెంపుదలలు ఉండే అవకాశం ఉంది. పాలసీ రేట్ల పంపు ఫలితంగా రుణాల ఖర్చు పెరుగుతుంది. దీంతో నిర్మాణ వ్యయం 5 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గృహ డిమాండ్ పై పెద్దగా ప్రభావం పడుతుందని అనుకోవడంలేదు.
– శరాన్ష్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles