poulomi avante poulomi avante

న్యూయార్క్ త‌ర‌హా న‌గ‌రాభివృద్ధి- అన‌రాక్ ఛైర్మ‌న్ అనూజ్ పూరి

Anarock Chairman Mr Anuj Puri Exclusive Interview with King Johnson Koyyada

  • అడుగుపెడుతున్న‌ అమెరికా జీసీసీ సెంట‌ర్లు
  • ఫార్మా రంగం గ‌ణ‌నీయంగా వృద్ధి
  • ఐటీ సంస్థ‌ల చూపు భాగ్య‌న‌గ‌రం మీదే
  • పెరిగిన భూముల ధ‌ర‌లే కాస్త‌ ప్ర‌తికూల‌త‌
  • ప్రీ సేల్స్‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి
  • ఏటా 21 వేల ఇళ్ల‌ను విక్ర‌యిస్తాం

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

ఆధునిక ఆవిష్క‌ర‌ణ‌ల ద్వారా రియాల్టీ రంగాన్ని కొత్త పుంత‌ల్ని తొక్కిస్తూ.. టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని భార‌త రియ‌ల్ రంగంలో స‌రికొత్త మార్పుల్ని తేవ‌డంలో అన‌రాక్ సంస్థ క్రియాశీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. విభిన్న‌మైన ఆస‌క్తుల్ని క‌లిగి ఉన్న భార‌త రియ‌ల్ సేవ‌ల సంస్థ‌ల్లో ప్ర‌ముఖంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రియ‌ల్ రంగం తారాస్థాయికి చేరుకున్న త‌రుణంలో.. మార్కెట్ స్థితిగతుల్ని విశ్లేషించ‌డంలో అన‌రాక్ మించిన సంస్థ ఉంటుంది చెప్పండి. అందుకే, ఈ వారం రెజ్ న్యూస్‌.. అన‌రాక్ సంస్థ ఛైర్మ‌న్ అనూజ్‌పూరిని ప్ర‌ముఖంగా క‌లిసింది. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌పై ప్రపంచ మాంద్యం ప్రభావం, పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు, మార్కెట్‌లోకి ప్రవేశించిన కొత్త రియల్టీ కంపెనీలు వంటి అంశాల‌పై సంభాషించింది. మ‌రి, ఇంట‌ర్వ్యూలోని సారాంశమిదే..

 మీ అపారమైన అనుభవంతో, భారతీయ రియల్టీ మరియు హైదరాబాద్‌పై వాణిజ్య మరియు నివాస అంశాల్లో ప్రపంచ మాంద్యం ప్రభావం గురించి మా పాఠ‌కుల‌కు వివ‌రిస్తారా?

జ: ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రెసిడెన్షియల్ వైపు ఈ రంగం చాలా బాగా కొనసాగుతోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో, రెసిడెన్షియల్ ప్రాపర్టీలలో మళ్లీ డిమాండ్ ఏర్పడింది. భారతదేశం అంతటా మార్కెట్ స్థిరంగా కొన‌సాగుతుంది. హైదరాబాద్‌లో అన్ని స్థాయిలో ఇళ్ల‌కు గిరాకీ నెల‌కొంది. హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ఏకైక సమస్య భూమి ధ‌ర‌. ఇళ్ల అమ్మ‌క‌పు ధ‌ర‌లు భూమి రేట్ల‌తో స‌మానంగా పెర‌గ‌ట్లేదు. మొత్తం మీద హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో భార‌త‌దేశంలోనే మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తోంది.

ప్రపంచ ఆర్థిక మందగమనం నేప‌థ్యంలో.. వాణిజ్య రంగంలో ఏమి జ‌రుగుతోంద‌నే ప్ర‌శ్న తలెత్తుతోంది. ఆర్థిక మాంద్యం కార‌ణంగా ప్ర‌పంచ దేశాల్లో కార్పొరేట్ సంస్థ‌లు అధిక స్థ‌లాన్ని తీసుకోవ‌ట్లేదు. ఎందుకంటే, అధిక శాతం మంది ఇంకా ఆఫీసుల‌కు రావ‌డం ఆరంభించ‌లేదు. ఎందుకంటే, వారంతా ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. యూర‌ప్ ప్ర‌జ‌లు ఆఫీసుకొచ్చి ప‌ని చేస్తున్నారు. హాంకాంగ్‌, సింగ‌పూర్‌, ఇండియా వంటి దేశాల్లో అధిక శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల‌కు వెళుతున్నారు. అమెరికా ప్ర‌జ‌లే ఇంకా వ‌ర్క్ ఫ్ర‌మ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగులైతే ప‌ని చేస్తున్నారు. కాక‌పోతే, ఐటీ ఉద్యోగులే వారానికి మూడు లేదా నాలుగు రోజులు ప‌ని చేస్తున్నారు. కాక‌పోతే బ‌డా ఐటీ పార్కుల్లో ప‌ని చేసే ఉద్యోగులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆఫీసుల‌కు వెళుతున్నారు. అయితే, ప్ర‌పంచ ఆర్థిక మాంద్యం కార‌ణంగా మార్కెట్లో మంద‌గ‌మ‌నం ఏర్ప‌డ‌టం అధిక ప్ర‌భావాన్ని క‌న‌బ‌రుస్తోంది. అయితే, మ‌న ఇండియాలో ప‌రిస్థితి కాస్త మెరుగ‌ని చెప్పొచ్చు.

యూఎస్‌కి చెందిన బ‌డా కార్పొరేట్ సంస్థ‌లు గ‌తంలో గ్లోబ‌ల్ క్యాప‌బిలిటీ సెంట‌ర్లు భార‌త‌దేశానికి ఔట్ సోర్సింగ్ చేసేవి కావు. అలాంటి వాటిలో ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. అమెరికాలో ప్రాసెసింగ్ చేసే సంస్థ‌లు ఇండియాలోని థ‌ర్డ్ పార్టీ సంస్థ‌ల‌కు ఔట్‌సోర్సింగ్ చేయ‌కుండా.. అవే భార‌త‌దేశానికి విచ్చేసి త‌మ సొంత క్యాంప‌స్‌లు, కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నాయి. సొంతంగా ఉద్యోగుల్ని నియ‌మిస్తున్నాయి. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఈ పోక‌డ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వీటి నుంచి భార‌త వాణిజ్య స‌ముదాయాల‌కు అధిక గిరాకీ ఏర్ప‌డుతోంది. ఈ సంస్థ‌లు సిటీలో బ‌డా క్యాంప‌స్‌ల‌ను తీసుకుంటున్నాయి. అవి థ‌ర్డ్ పార్టీల‌కు ఈ ప‌నిని అప్ప‌గిస్తే.. ఆయా సంస్థ‌లు ఒక వ్య‌క్తికి 70 నుంచి 80 చ‌ద‌రపు అడుగుల స్థ‌లాన్ని తీసుకుంటాయి. అదే జీసీసీలు అయితే ఒక వ్య‌క్తికి క‌నీసం 125 నుంచి 150 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని కావాలంటాయి. అంటే, అవి కాస్త బ‌డా స్థ‌లాన్ని తీసుకుంటాయ‌న్న‌మాట‌. హైద‌రాబాద్ ఆఫీసు స‌ముదాయాల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ స‌ర‌ఫ‌రా అధికంగా ఉంది. ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా అందుబాటులోకి వ‌చ్చేస్తే.. అంత డిమాండ్‌ ఇక్క‌డ లేదు. వాస్త‌వానికి, కాగితం మీద రాసే బిల్డ‌ప్ ఏరియాకు, నిర్మాణం జ‌రిగిన ఆఫీసు స్థ‌లం మ‌ధ్య తేడా ఉంటుంది.

మీరు జీసీసీ కంపెనీల గురించి చెప్పారు క‌దా.. ఇంత‌వ‌ర‌కూ ఎన్ని సంస్థ‌లు భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించాయి?

అనేక సంస్థ‌లు మ‌న దేశంలోకి అడుగుపెట్టాయి. నేను వాటికి మూడు ర‌కాలుగా విభ‌జించాను. ఫార్మా వ‌ల్ల హైద‌రాబాద్ గ‌ణ‌నీయంగా ప్ర‌యోజ‌నం పొందుతోంది. ఇందులోని అనేక ప‌రిశోధ‌న సంస్థ‌లు హైద‌రాబాద్‌కు విచ్చేయ‌డానికి ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నాయి. మందుల ఉత్ప‌త్తి సంస్థ‌లు, ప‌రిశోధ‌న కంపెనీలు వంటివి ఆసక్తి చూపిస్తున్నాయి. రెండోది, ఆర్థిక సంస్థ‌ల్లో ముఖ్యంగా బ‌డా అమెరికా, యూర‌ప్ బ్యాంకులు ఇక్క‌డికి విచ్చేస్తున్నాయి. మూడోది, టెక్నాల‌జీ సంస్థ‌లు మ‌న‌వైపు ఆస‌క్తిగా చూస్తున్నాయి.

హైద‌రాబాద్‌లో ఏటా కొత్త‌గా 60 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీసు స‌ముదాయానికి గిరాకీ ఉంటుంది. కొన్నిసార్లు ఎన‌భై నుంచి తొంభై ల‌క్ష‌ల చ‌.అ.ల స్థ‌లాన్ని ప‌లు సంస్థ‌లు తీసుకుంటాయి. ఇప్పుడు న‌గ‌రంలో ఉన్న స‌ర‌ఫ‌రాను చూస్తే.. క‌నీసం నాలుగైదేళ్ల‌కు స‌రిపడా స్టాకు ఉంద‌నిపిస్తోంది. ఎంత‌లేద‌న్నా రెండు నుంచి మూడున్న‌ర కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన ఆఫీసు సముదాయం మార్కెట్లోకి అడుగుపెడుతోంది. విడ‌త‌ల వారీగా ఈ స్థ‌లం అందుబాటులోకి వ‌స్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ, ఒకేసారి మార్కెట్లోకి వ‌చ్చిన‌ప్పుడే ఇబ్బంది ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది.

ప్ర‌: 2000 నోట్ల ర‌ద్దు ప్ర‌భావం రియాల్టీ రంగంపై ప‌డుతుందా?

ఇంకా ప్ర‌భావం అయితే ప‌డ‌లేదు. డిమానిటైజేష‌న్ స‌మ‌యంలో కొంత స‌మ‌స్య‌ల్ని చూశాం. ఇప్పుడైతే అలాంటి సమ‌స్య‌లేం క‌నిపించ‌ట్లేదు.

ప్ర‌: ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల వాణిజ్య స‌ముదాయాన్ని ఒక కంపెనీ తీసుకుంటే.. నివాస స‌ముదాయానికి ఎంత గిరాకీ పెరుగుతుంది? ఈ విష‌యంలో మార్కెట్ డైన‌మిక్స్ ఎలా ఉంటాయి?

వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీసు స్పేస్‌ను ఒక సంస్థ తీసుకుంటే.. ఒక వ్య‌క్తికి 100 చద‌ర‌పు అడుగుల స్థ‌లం అవ‌స‌రం అవుతుంది. అంటే, ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల్లో ఒక కంపెనీ వెయ్యి మంది ఉద్యోగుల‌ను తీసుకుంటే.. అందులో క‌నీసం యాభై శాతం మందిని లెక్కించినా, ఐదు వంద‌ల మంది ఇళ్ల‌ను తీసుకుంటారు.

ప్ర‌: హైద‌రాబాద్‌కు విచ్చేయ‌డానికి ఏయే నిర్మాణ దిగ్గజ సంస్థ‌లు ఆస‌క్తి చూపిస్తున్నాయి?

హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్ట‌డానికి అనేక మంది భార‌తీయ డెవ‌ల‌ప‌ర్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. గ‌తంలో ఎక్కువ‌గా ద‌క్షిణాది సంస్థ‌లే ఎక్కువ‌గా దృష్టి సారించేవి. ఉదాహ‌ర‌ణ‌కు పుర్వాంక‌ర‌, ప్రెస్టీజ్‌, బ్రిగ్రేడ్‌, శోభా వంటివి ఆస‌క్తిని చూపించేవి. కానీ, ప్ర‌స్తుతం ముంబైకి చెందిన డెవ‌ల‌ప‌ర్లు భాగ్య‌న‌గ‌రంలోకి అడుగుపెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ర‌హేజా, లోదా, గోద్రెజ్ వంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పొచ్చు.

ప్ర‌: హైద‌రాబాద్ రియ‌ల్ రంగానికి గ‌ల సానుకూల‌త‌లేమిటో చెబుతారా?

హైద‌రాబాద్ ఇప్పుడు అంత‌ర్జాతీయ మార్కెట్‌. ఎంతో లోతైన మార్కెట్‌. గిరాకీని కొన‌సాగించిన మార్కెట్ అని చెప్పొచ్చు. హైద‌రాబాద్‌ను రాత్రివేళ‌లో చూస్తే.. న్యూయార్క్ త‌ర‌హా క‌నిపిస్తుంది. ఇక్క‌డి ఆకాశ‌హ‌ర్మ్యాలు, లైట్లు, అంద‌మైన భ‌వ‌నాలు, వాటి బయ‌టి ప్రాంతం వంటివి చూస్తే మ‌న్‌హ‌ట్ట‌న్‌లో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్ప‌ట్నుంచి ఓ ఐదేళ్ల త‌ర్వాత భాగ్య‌న‌గ‌రానికి చూస్తే గ‌న‌క‌.. అంత‌ర్జాతీయ న‌గ‌రంగా ఖ్యాతినార్జిస్తుంది. ఇక్క‌డి మౌలిక స‌దుపాయాలు, మ్యాన్ ప‌వ‌ర్‌, రియ‌ల్ ఎస్టేట్ వంటివాటిలో నాణ్య‌త క‌నిపిస్తుంది. దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చితే, హైద‌రాబాద్ ఇంకా అందుబాటులోనే ఉంద‌ని చెప్పొచ్చు. ఈ న‌గ‌రానికి నేను గొప్ప అభిమానిని. వ‌చ్చే ఐదేళ్లలో మ‌రింత అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది.

ప్ర‌: హైద‌రాబాద్లో అడుగు పెట్టేందుకు ఎందుకు జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు దృష్టి సారిస్తున్నాయి?

జ‌: ఈ న‌గ‌రానికి అనేక సానుకూలాంశాలున్నాయ‌. ముందుగా ఇక్క‌డ నాణ్య‌మైన ట్యాలెంట్ దొరుకుతుంది. అందుకే, అనేక మంది ఈ న‌గ‌రానికి వ‌ల‌స వ‌స్తున్నారు. ఇత‌ర న‌గ‌రాల‌కు చెందిన అనేక మంది యువ‌త హైద‌రాబాద్‌లోకి అడుగుపెడుతున్నారు. రెండోది, ఇక్క‌డి మౌలిక స‌దుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు, రోడ్లు, మెట్రో, సెక్యూరిటీ వంటివి మెరుగ్గా ఉన్నాయి. మూడోది, ఇత‌ర న‌గ‌రాల‌తో పోల్చితే ఇక్క‌డ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా త‌క్కువ‌. ఈ మూడు అంశాల్ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు గ‌మ‌నిస్తాయి. ఇక్క‌డ మెరుగైన ఆస్ప‌త్రులున్నాయి. వినోద కేంద్రాలున్నాయి. విద్యాసంస్థ‌ల‌కు కొద‌వే లేదు. కాలేజీలు, హోట‌ళ్లు, రిటైల్ మాళ్లు.. ఇలా చూస్తే హైద‌రాబాద్ న‌గ‌రానికి అనేక సానుకూల‌తలు ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

ప్ర‌: హైదరాబాద్‌లో జ‌రిగే ప్రీ సేల్స్ ను మీరు స‌మ‌ర్థిస్తారా?

జ: నేను రెరాకు పెద్ద మద్దతుదారుడిని. నిజంగా చెప్పాలంటే రెరా ఎంతో శుభ్రం చేస్తోంది. రియ‌ల్ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు వ్య‌క్తులు చేసే త‌ప్పుల్ని రెరా పూర్తిగా తొల‌గించేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రెరా ఎంతో ప‌రిణితి చెందింది. మ‌హారాష్ట్ర రెరా వ‌ల్ల అక్క‌డి మార్కెట్ వృద్ధి చెందింది. అక్క‌డ పార‌ద‌ర్శ‌క‌త పెరిగింది. కొన్ని నెల‌ల్లోనే.. అక్క‌డి ఇళ్ల కొనుగోలుదారుల‌కు ఎంతో న‌మ్మ‌కం పెరిగింది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే రెరా స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డాన్ని ఆరంభించింది. రెరా అనుమ‌తి లేని ఇళ్ల‌ను అస్స‌లు అమ్మ‌కూడ‌దు. అలా చేసిన‌వారిని ప్రాసిక్యూట్ చేయాలి. అప్పుడే డెవ‌ల‌ప‌ర్ల‌లో స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతుంది. దీంతో, ఇళ్ల కొనుగోలుదారుల‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. అనుమ‌తి లేకుండా ఆరంభ‌మ‌య్యే ప్రాజెక్టులపై అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. అయితే, త‌ర‌గ‌తి గ‌దిలో ఒక‌రిద్ద‌రు క్ర‌మ‌శిక్ష‌ణ లేని విద్యార్థులున్న‌ట్లే.. ఈ రంగంలోనూ ఉండొచ్చు. అలాంటి వారిపై అధికారులు స్ట్రిక్టుగా వ్య‌వ‌హ‌రించాలి.

Anarock Chairman Anuj Puri Exclusive Interview
Anarock Chairman Anuj Puri Exclusive Interview

అన‌రాక్ సంస్థ గురించి (క్లుప్తంగా)

మాది కొత్త‌త‌ర‌హా రియ‌ల్ ఎస్టేట్ స‌ర్వీసెస్ సంస్థ‌. టెక్నాల‌జీ, డిజిటిల్ ద్వారా ఎక్కువ‌గా రెసిడెన్షియ‌ల్ మార్కెట్ మీద దృష్టి పెట్టాం. ఏటా మ‌న‌దేశంలో 21 వేల ఇళ్ల‌ను విక్ర‌యిస్తాం. డెవ‌ల‌ప‌ర్లు స్థ‌ల సేక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మ‌య్యే డెట్‌, ఈక్విటీని అందించేందుకు తోడ్పాటునిస్తాం. స్థ‌ల విలువ నిర్థార‌ణ‌, మెరుగైన భూవినియోగం చేసేందుకు తోడ్పాటునిస్తాం. మాళ్లు, హోట‌ళ్లు, ఆఫీసు స్థ‌ల విక్ర‌యం, లీజుకు తోడ్పాటునిస్తాం. హైద‌రాబాద్ రెసిడెన్షియ‌ల్ విభాగం మాకో స్పెష‌ల్ మార్కెట్‌. ఆధునిక ఆవిష్క‌ర‌ణ‌ల్ని ఇక్క‌డ ప్ర‌వేశ‌పెట్టాం. ఇండ‌స్ట్రీయ‌ల్‌, వేర్‌హౌసింగ్‌, లాజిస్టిక్స్, ఆఫీసు విభాగంలోనూ మేం సేవ‌ల్ని అందిస్తున్నాం.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles