Categories: TOP STORIES

హ‌డావిడిగా కూల్చొద్దు..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమ‌తులిచ్చిన అపార్టుమెంట్ల‌కు సైతం హైడ్రా నోటీసుల్ని ఇస్తోంది. చెరువుల్లో క‌ట్టార‌ని.. వాటిని కూల్చేయాల‌ని అంటోంది. అయితే, ఈ రెండు స్థానిక సంస్థ‌లు అంత ఆషామాషీగా అనుమ‌తుల్ని మంజూరు చేయ‌వ‌నే విష‌యాన్ని హైడ్రా గుర్తించాలి. ఒక‌వేళ నిజంగానే అనుమ‌తుల్లో లొసుగులు ఉన్నాయ‌ని భావిస్తే.. అలాంటి కేసుల్లో ప్ర‌భుత్వం ఏం చేయాలంటే.. ముగ్గురు లేదా న‌లుగురు నిపుణుల‌తో క‌లిపి ఒక క‌మిటీ వేసి..

స్థానిక సంస్థ‌లు అనుమ‌తులిచ్చిన అపార్టుమెంట్ల‌ను క్షుణ్నంగా గ‌మ‌నించాలి. ఒక‌వేళ త‌ప్పుడు అనుమ‌తుల‌ని రుజువైతే.. ఆయా నిర్మాణాల్ని కూల్చివేయాల్సిందే. ఇందులో ఎలాంటి మొహ‌మాటం లేదు. ఒక శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో ప‌రిశీలించి తుది నిర్ణ‌యానికి రావాలే తప్ప‌.. హ‌డావిడిగా కూల్చివేత‌లు చేప‌ట్ట‌కూడ‌దు. ఇలా చేస్తే స‌హ‌జ సంప‌ద ఎంత వృథా అవుతుందో ఒక్క‌సారి ఆలోచించాలి.

This website uses cookies.