దేశంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ లో బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్స్ స్పేస్ లు కీలకంగా వ్యవహరించాయి. 2024 మూడో త్రైమాసికంలో ఈ విభాగాలు పాన్-ఇండియాలో 39 శాతం వాటా కలిగి ఉన్నట్టు వెస్టియన్ తాజా నివేదిక వెల్లడించింది. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది. అదే సమయంలో ఐటీ రంగం వాటా 2024 క్యూ2లో 38 శాతం ఉండగా.. క్యూ3లో 23 శాతానికి తగ్గిపోయినట్టు వివరించింది. ఈ ఏడాది త్రైమాసికాలవారీగా అత్యధిక ఆక్యుపెన్సీ క్యూ3లోనే. నమోదైంది.
మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మన దేశంలో 18.61 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆక్యుపెన్సీ నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 17%, ఈ ఏడాది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా కూడా గత త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం పెరిగి 12.80 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు నివేదిక తెలిపింది. అయితే, నిర్మాణ కార్యకలాపాలు మాత్రం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం తగ్గాయి. కాగా, 2024 క్యూ3లో దక్షిణాది నగరాలు (బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్) పాన్-ఇండియా ఆక్యుపెన్సీలో 61% వాటాను కలిగి ఉన్నాయి.
2024 క్యూ2లో ఇది 55 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో బెంగళూరు వాటా 2024 క్యూ2లో 25% ఉండగా.. Q3లో 36 శాతానికి పెరిగింది. మరోవైపు, అదే కాలంలో ముంబై వాటా 20% నుంచి 12 శాతానికి తగ్గింది. 2024 క్యూ3లో బెంగళూరు 6.63 మిలియన్ చదరపు అడుగుల ఆక్యుపెన్సీతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్ 2.79 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంది. అంతేకాకుండా, ఆఫీస్ స్పేస్ టేక్‌లో ఆకస్మిక పెరుగుదల కారణంగా ఢిల్లీ అత్యధికంగా 118% త్రైమాసిక వృద్ధి సాధించింది. ముంబై, చెన్నై మినహా అన్ని నగరాలు క్యూ3లో 8 2024లో నిర్మాణ కార్యకలాపాల్లో పురోగతిని నమోదు చేశాయి. ముంబైలో కొత్త పనులు 73% తగ్గాయి. చెన్నై మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 29% తగ్గుదల నమోదు చేసింది. గత నాలుగు త్రైమాసికాలలో హైదరాబాద్‌లో అత్యధికంగా 4.10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం పూర్తయింది. ఇక ప్రస్తుత త్రైమాసికంలో కోల్‌కతాలో సగటు అద్దెలు స్థిరంగా ఉండగా, బెంగళూరు గత త్రైమాసికంలో అత్యధికంగా 1.1% వృద్ధిని సాధించింది.
This website uses cookies.