poulomi avante poulomi avante

తారాలోకం చూతము రారండి

సినీతారలంటే చాలామందికి ఎంతో అభిమానం. వారిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించేవారు ఎందరో. తమ అభిమాన నటీనటులకు సంబంధించి చిన్న విషయమైనా సరే వారికి ఎంతో ఆసక్తి. వారి ఇల్లు ఎలా ఉంటుంది? ఇంట్లో వారు ఎలా గడుపుతారు? వారికి ఇష్టమైన రంగులేంటి? ఇలా ప్రతి అంశమూ అభిమానులకు ఆసక్తికరమే. సెలబ్రిటీ హోమ్స్ ద్వారా ప్రముఖ నటీనటుల ఇంటి సంగతులను క్రమం తప్పకుండా పంచుకుంటున్న రియల్ ఎస్టేట్ గురు.. ఈసారి మరికొంత మంది నటీనటుల ఆసక్తులు, ఇష్టాలు, ఇంటి విశేషాలతో మీ ముందుకు వచ్చింది. అవేంటో చూసేద్దామా?

హృతిక్ ఇంట్లో చాక్లెట్ మెషీన్..

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ముంబై జుహూలో ఉన్న ఇల్లు లగ్జరీ, ఇన్నోవేషన్, వ్యక్తిగత విచిత్రాల సంతోషకరమైన సమ్మేళనం. ఆయన ఇంట్లో ఓ భారీ చాక్లెట్ వెండింగ్ మెషీన్ ఉంది తెలుసా? తీపి సంగతులు పంచుకోవడానికి అందులో ఎప్పుడూ చాక్లెట్లు నిల్వ ఉంటాయి. ఇక ఇంట్లో నుంచి అరేబియా మహాసముద్ర వీక్షణ అదిరిపోతుంది. సందడిగా ఉండే నగరంలో ఈ ఇల్లు ఓ నిర్మలమైన ఒయాసిస్సులా ఉంటుంది. హృతిక్ ఇంట్లో ప్రత్యేకమైన మంకీ బార్ లు ఉంటాయి. అవి ఆయన పిల్లల కోసమే కాకుండా ఫిట్ నెస్, వినోదం పట్ల హృతిక్ నిబద్ధతను తెలియజేస్తాయి. ఇంట్లో ఓ ఇంగ్లిష్ టెలిఫోన్ బూత్ కూడా ఉంది. ఆధునిక డెకర్ కు పాతకాలపు ఆకర్షణ జోడించి ఔరా అనిపించేలా ఆయన ఇల్లు కనిపిస్తుంది. హృతిక్ ఇల్లు నాటికల్ స్ఫూర్తితో రూపొందించారు. బీచ్ లపై ఆయనకు ఉన్న ప్రేమను ఇది ప్రతిబింబిస్తుంది. ఇంటీరియర్లు వెచ్చరి కలర్ పాలెట్, సున్నితమైన వుడెన్ ఫ్లోరింగ్, హాయిగొలిపే ఫర్నిచర్ తో ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. తన పిల్లలతో తరచు ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు వీలులా ఓ చెస్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు.

షారుక్ ఖాన్ మన్నత్.. సూపర్

నిత్యం సందడిగా ఉండే ముంబై నడిబొడ్డున ఓ స్వర్గధామం వంటి ప్యాలెస్ నటుడు షారుక్ ఖాన్ కచ్చితంగా కింగ్ సైజ్ జీవితాన్ని జీవిస్తున్నారు. ముంబై చిరునామాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన మన్నత్.. షారుక్ నివాసం. ఆ ఇంటి గొప్పతనం, ప్రత్యేక లక్షణాలతో ఇది ఎందరినో ఆకట్టుకుంటుంది. షారుక్ భార్య గౌరీ ఖాన్, టామ్ డిక్సన్ చేత నియో క్లాసికల్ థీమ్ తో నిర్మించిన ఈ సాగరు ముఖ భవనం.. విలాసవంతమైన, చక్కదనంతో నిండిన ఆరు అంతస్తుల్లో ఉంటుంది. మన్నత్ లోకి ప్రవేశిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువుల అద్భుతమైన సేకరణ చూసి తన్మయత్వం చెందడం ఖాయం. అటు పురాతన వస్తువులే కాకుండా ఇటు అత్యాధునిక ఇన్ స్టాలేషన్లు కూడా చూస్తారు. ఓ ప్రత్యేకమైన ఫీచర్ ప్రైవేట్ థియేటర్.. ఇంట్లో మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. షారుక్ కు చదవడం అంటే ఎంత ఇష్టమో ఆ ఇంట్లో ఉన్న విశాలమైన లైబ్రరీని చూస్తే తెలుస్తుంది. వైబ్రేటింగ్ డంబెల్, ట్విస్టింగ్ ఫుషప్ బార్ల వంటి ప్రత్యేక పరికరాలతో కూడిన జిమ్, ఫ్రెంచ్ డెకర్ తో కూడిన విశాలమైన హాలు, పెద్ద డ్రాయింగ్ రూమ్, అందమైన లాన్ లు మన్నత్ ప్రత్యేకతలు. పెద్ద పెద్ద స్తంభాలతో కూడిన ప్రవేశ ద్వారం.. ఈ అద్భుతమైన నివాసానికి రాచరిక సొగసు తీసుకొచ్చింది.

లాస్ ఏంజెల్స్ లో ప్రియాంక విలాస భవనం..

నటి ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ లకు లాస్ ఏంజెల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఆ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు. ఆ ఇంటికి ఉన్న రెండు లేన్ల బౌలింగ్ అల్లే.. వారి సంపన్న భవనానికి మరింత విలువ జోడించింది. హాలీవుడ్ కొండల అద్భుతమైన వీక్షణలతో కూడిన ఇన్ఫినిటీ పూల్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ.. ఇంట్లోని బౌలింగ్ అల్లే మాత్రం సొగసైన ఆ నివాసానికి ఉల్లాసాన్ని తీసుకొచ్చింది. ఇంకా ఈ భవనంలో హోమ్ థియేటర్, ఇండోర్ బాస్కెట్‌బాల్ కోర్ట్, జిమ్, స్పా వంటివి ఉన్నాయి.

కరీనా ఇంట్లో టెర్రస్ పూల్ ప్రత్యేక ఆకర్షణ..

బాలీవుడ్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇటీవల ముంబైలోని విలాసవంతమైన ఇంట్లోకి అడుగు పెట్టారు. సద్గురు శరణ్ భవనంలో ఉన్న ఈ కొత్త నివాసం.. ఎవరి దృష్టినైనా ఆకర్షించే విధంగా అద్భుతమైన టెర్రస్ పూల్ కలిగి ఉంది. థ జంట తమ ఇద్దరు కుమారులు తైమూర్, జహంగీర్‌లతో కలిసి గత ఏడాదిగా తమ అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా ఆ అపార్ట్ మెంట్ ను డిజైన్ చేస్తున్నారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ దర్శిని షా రూపొందించిన ఈ అపార్ట్ మెంట్ అనేక విలాసవంతమైన, విశాలమైన అంశాలు కలిగి ఉంది. రూఫ్ టాప్ స్విమింగ్ పూల్ అయితే అదుర్స్. పచ్చదనంతో కూడిన ఈ పూల్.. నగర జీవితంలోని సందడి నుంచి తప్పించుకుని సేద తీరుస్తుంది. సైఫ్ కు చదవడం అంటే ఇష్టం. అందుకే వీరి ఇంట్లో భారీ లైబ్రరీ కూడా ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles