poulomi avante poulomi avante

నిర్మాణ సైట్ల‌లో ప్ర‌మాదాల్ని నిరోధించాలి!

Builders Must Protect and shift their construction workers to safer places, instructed DanaKishore

* పుర‌పాల‌క శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీ దాన‌కిశోర్‌

భారీ వర్షాల కారణంగా నిర్మాణ సైట్ల‌లో ఎలాంటి ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా.. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని బిల్డర్స్ కి పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాల మూలంగా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గోడ‌లు కూలిపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్ఠ చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌న్నారు. పురాతన, శిథిలావస్థ లో వున్న భవనాల వద్ద వున్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలాలు, అప్రోచ్ నాలాలున్న ప్రాంతాల్లో.. లౌడ్ స్పికర్ల‌ ద్వారా ప్రచారం చేయాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. క్రెడాయ్‌, న‌రెడ్కో, తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్, తెలంగాణ డెవ‌ల‌ప‌ర్స్ వంటి నిర్మాణ సంఘాల‌లు త‌ప్ప‌నిస‌రిగా వారి భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు పూర్తి స్థాయి భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా జరుగుతున్న నీటి కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన చోట సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని.. జ‌ల‌మండ‌లి, ప్ర‌జారోగ్యం విభాగాల‌కు క్లోరిన్ మాత్రాల‌ను అందించాల‌ని తెలిపారు. నీటి నాణ్యతను నిర్ధారించేందుకు నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles