BRS MLA K Prabhakar Reddy (File Photo)
పైసలిస్తం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమని.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అంటున్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణకు చెందిన కొందరు బిల్డర్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారంలోకి ఏ పార్టీ అంటే వారితో కలిసి నిర్మాణ రంగం పని చేస్తుందే తప్ప.. తమకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వ్యాపారం చేసుకునే తమను అనవసరంగా రాజకీయాల్లోకి లాగవద్దని పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను చూసి పలువురు బిల్డర్లు ఆశ్చర్యపోయారు. ఎవరు తోచినట్లు వారు తమను వాడుకుంటున్నారని వాపోయారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటామన్నారు. అంతేతప్ప, రాజకీయాల్లోకి తమన లాగొద్దని హితువు పలికారు.
This website uses cookies.