భారత్ లో పండగల సందర్బంగా ఏదైనా వస్తువు కొంటే బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. ఈ పరంపర రియల్ ఎస్టేట్ లోను ఉంది. అపార్టుమెంట్ లో ఫ్లాట్ లేదంటే విల్లా కొంటే పండగ ఆఫర్ లో ఫర్నీచర్, కిచెన్ సామాన్లు వంటివి ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఢిల్లీలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇల్లు కొంటే ఖరీదైన కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన జేపీ గ్రీన్స్.. తమ వద్ద లగ్జరీ విల్లా కొన్నవారికి లంబోర్గిని ఉరుస్ మోడల్ కారును ఉచితంగా ఇస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ దీపావళి ధమాకా ఆఫర్ ఇప్పుడు సర్వత్రా వైరల్‌గా మారింది. ట్విట్టర్ పోస్టులో తాము విక్రయించే రూ.26 కోట్ల రూపాయల విలువైన అల్ట్రా-ప్రీమియం విల్లాను కొనుగోలు చేసే.. కస్టమర్లకు లంబోర్గిని ఉరుస్ కారును ఫ్రీగా ఇస్తామని పేర్కొన్నారు. జేపీ గ్రీన్స్ బహుమతిగా ఇస్తామంటున్న లంబోర్గిని ఊరస్ కారు ఖరీదు కనీసం 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అయితే విల్లా కొనేవారు పార్కింగ్, స్విమ్మింగ్ ఫూల్, థియేటర్, క్లబ్ మెంబర్షిప్, గోల్ఫ్ కోర్స్ వంటి విలాసవంతమైన సౌకర్యాల కోసం అదనంగా రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ట్వీట్లో తెలిపారు.
This website uses cookies.