Categories: TOP STORIES

రిజిస్ట్రేషన్లు డల్

రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన లావాదేవీలు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు డల్ గా సాగుతున్నాయి. వరుసగా మూడో నెల కూడా ఆశించిన రీతిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. తాజాగా అక్టోబర్ లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గతేడాది అక్టోబర్ తో పోలిస్తే.. ఏకంగా రూ.140 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు మందగించాయి. గతేడాది అక్టోబర్‌ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి.

గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్‌ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ప్రధాన కారణం హైడ్రా కూల్చివేతలేనని ఎక్కువ మంది భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా రియల్ రంగం పరిస్థితి బాగోలేదని.. అందువల్ల అమ్మకాలు తగ్గాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

This website uses cookies.