Categories: TOP STORIES

అందుబాటు గృహాల ధ‌ర‌.. రూ.55 ల‌క్ష‌లుగా మార్పు?

అందుబాటు గృహాలకు సంబంధించిన క‌నీస ధ‌ర‌ను రూ.55 ల‌క్ష‌లుగా కేంద్రం నిర్ణ‌యించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ఇప్ప‌టివ‌రకూ రూ.45 ల‌క్ష‌లుగా ఉన్న ఈ రేటు.. అతిత్వ‌ర‌లో రూ.55 ల‌క్ష‌లుగా మార్చే వీలుంద‌ని స‌మాచారం. ఒక‌వేళ ఇది అమ‌ల్లోకి వ‌స్తే.. ద్వితీయ‌, తృతీయ శ్రేణీ న‌గ‌రాల్లో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి మార్గం సుగుమం అవుతుంది.

ఈ అంశం గురించి ఇప్ప‌టికే నారెడ్కో నేష‌న‌ల్ ప్రెసిడెంట్ జి హ‌రిబాబు సైతం ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల మీద జీఎస్టీ ఒక శాత‌మే ఉండ‌టంతో సామాన్యుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

This website uses cookies.