‘‘సర్, నేను కొండాపూర్ లో 20వ అంతస్తులో ఒక ఫ్లాట్ చూశాను. చూడటానికి
చాలా ఆకర్షణీయంగా ఉంది. ధర కూడా అందుబాటులోనే ఉంది. బెడ్ రూములోకి వెళ్లి కిటికీ తెరిచి చూస్తే.. శ్మశానం కనిపిస్తోంది. నేను ఒక్కసారి షాక్ కు గురయ్యాను. అంతా బాగుందనుకుంటే ఈ శ్మశానం నన్ను ముందు పడనియ్యడం లేదు. నన్నేం చేయమంటారు? శ్మశానం పక్కనే ఫ్లాట్ కొనవచ్చా?’’
హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, యూసుఫ్ గుడా, హైదర్ నగర్, నార్సింగి, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో శ్మశానం పక్కనే అపార్టుమెంట్లను చూడొచ్చు. పైగా, అందులో కొన్నేళ్ల నుంచి ప్రజలు నివాసం ఉంటున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా కడుతున్న కొన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు అటుఇటుగా లేదా వెనకవైపు సమాధుల్ని గమనించొచ్చు. అందుకే, మనలో చాలామందికి కలిగే సహజమైన సందేహం.. వీటి పక్కన ఫ్లాటు కొనవచ్చా? వాస్తుశాస్త్ర ప్రకారం.. శ్మశానవాటిక పక్కన ఫ్లాటు కొనవచ్చు. ఇల్లు కూడా కట్టుకోవచ్చు. కాకపోతే, కడుతున్న ఇంటికి శ్మశానవాటిక ఏ దిశలో ఉంది అనేది ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి.
- ఇంటికి సరిదిక్కులైన ఉత్తరం దిశలో కాని, తూర్పు దిశలో కాని, విదిక్కు అయిన ఈశాన్యం దిశలో కానీ శ్మశానవాటిక ఉన్నట్లయితే మంచిది.
- కడుతున్న ఇంటికి వాయువ్యం దిశలోనైతే ఒకందుకు పర్వాలేదు.
- కడుతున్న ఇంటికి పడమటి దిశలోకాని, దక్షణ దిశలో కానీ శ్మశానవాటిక మంచిది కాదు.
- విదిక్కుల విషయానికొస్తే అంటే ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం మరియు నైరుతి దిశలలోనైతే..
- కడుతున్న ఇంటికి ఈశాన్య దిశలో శ్మశాన వాటిక వుంటే మంచిదే.
- కడుతున్న ఇంటికి ఆగ్నేయం దిశలో కాని, నైరుతి దిశలో కానీ శ్మశానవాటిక ఎట్టి పరిస్థిలో మంచిది కాదు.
- కడుతున్న ఇంటికి సరిదిక్కులైన ఉత్తరం దిశలో కాని, తూర్పుదిశలో కాని లేదా ఇంటికి ఈశాన్య దిశలో శ్మశానవాటిక ఉన్నట్లయితే మీరు కట్టుకున్న ఇంటి ఎత్తు కన్నా, ఎత్తైన కట్టడాలు వచ్చే అవకాశమే లేదు అందుకని అలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టడం మంచిది. ఎలాగూ ఇళ్ళు ఉండవు కాబట్టి ఇరుగు పురుగు తలపోటు ఉండదు. ఎందుకంటే, ఇరుపొటుతో ఇల్లు చెడిందట, పొరుగు పోటుతో ఒళ్ళు చెడిందట అనే పెద్దల సామెత మీకు గుర్తుండి ఉంటుంది.
మట్టిలో కలిసిపోతాయ్..
శ్మశానంలో పాతీపెట్టే శవాలు నెలరోజుల తరువాత మట్టిలో మట్టియై కలిసిపోతాయి ఆనవాళ్ళు లేకుండా, ఇలాంటి వాటి గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మల్సిన అవసరం లేదు.
- ఇక ఇల్లు కట్టాలనుకున్న స్థలానికి దక్షిణ దిశలో కానీ, పడమటి దిశలో కానీ, ఆగ్నేయంలో లేదా నైరుతి దిశల్లో కానీ శ్మశానవాటిక ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, కారణం ఈ నాలుగు దిశల్లో ఎత్తైన కట్టడాలు కానీ బరువైన ప్రదేశాలు కానీ ఉండేలా చూసుకుని ఇల్లు కట్టుకోవాలి, అలా కాదని సాహసిస్తే వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- అలాగని “ఇలా ఉంటే అది అలాగే జరుగుతుంది” “అలా ఉంటే ఇది ఇలాగే జరుగుతుంది” అని ఖచ్చితమైన శాసనాలు, నిర్ధేశాలేమి లేవు. ప్రకృతిలోని పంచభూతాల “వరాలో” “వైపరీత్యాలో” తప్ప మరేమీ కాదు.
- ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాస్తు శాస్త్రాన్ని నమ్మటం కంటే అర్థం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
సంగా కుమార స్వామి,
వాస్తు శాస్త్ర పరిశోధకుడు,
కాల్: 8501956999